Jagan Famous Dialogue in Devara : దేవర లో ‘జగన్’ డైలాగ్.. గమనించారా..?

Jagan Kulam Chudam Matham Chudam Dialogue : కులం లేదు, మతం లేదు, భయం లేదు అంటూ ప్రకాష్ రాజ్ వాయిస్ తో దేవరను పరిచయం చేస్తారు

Published By: HashtagU Telugu Desk
Jagan Famous Dialogue In De

Jagan Famous Dialogue In De

Jagan Famous Dialogue in Devara : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న దేవర ట్రైలర్ (Devara Trailer) వచ్చేసింది..ట్రైలర్ లో ఎన్టీఆర్ ను చూస్తుంటే సినిమాలోవిశ్వరూపం చూపించాడని అర్ధం అవుతుంది. ఎన్టీఆర్ (NTR), RRR తర్వాత గ్యాప్ తీసుకొని దేవర సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. మాస్ డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో ఈ మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. సినిమా విడుదలకు కేవలం 15 రోజులు మాత్రమే ఉండటంతో మేకర్స్ ప్రమోషన్స్ లో స్పీడును పెంచారు. ఇప్పటికే మూడు పాటలను విడుదల చేసి సినిమా ఫై అంచనాలు పెంచేసిన మేకర్స్.. ఈరోజు ముంబై లో సినిమా ట్రైలర్‌ను గ్రాండ్‌గా విడుదల చేశారు. ఈ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. విడుదలై కొద్ది నిమిషాల్లోనే ఫ్యాన్స్ లైకులు షేర్స్ తో నెట్టింట ట్రెండ్ చేస్తున్నారు.

ఈ ట్రైలర్ లో కులం లేదు, మతం లేదు, భయం లేదు (Kulam Ledhu , Matham Ledhu , Bhayam ledhu Dialogue) అంటూ ప్రకాష్ రాజ్ వాయిస్ తో దేవరను పరిచయం చేస్తారు. ఈ డైలాగ్ విన్న వారంతా జగన్ ను గుర్తు చేసుకుంటున్నారు. ఎన్నికల ప్రచారంలో జగన్ మోహన్ రెడ్డి సైతం .. కులం చూడం,మతం చూడం, ప్రాంతం చూడమంటూ (Jagan Kulam Chudam Matham Chudam Dialogue) చెప్పుకొచ్చారు. ఈ డైలాగ్ సోషల్ మీడియా లో కూడా వైరల్ గా మరిదిని. ఇప్పుడు ఆ డైలాగునే దేవర సినిమాలో వాడినట్టు కనిపిస్తోంది. గతంలో కూడా ఎన్టీఆర్ జగన్ డైలాగ్‌ను స్టేజీ మీద చెప్పడం జరిగింది.

జగన్ గతంలో నాయకుడు అనేవాడు ఎలా ఉండాలంటే కార్యకర్తలు తలెత్తుకుని కాలర్ ఎగరేసేలా ఉండాలని పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. సిద్దు జొన్నలగడ్డ నటించిన టిల్లు స్క్వేర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా వచ్చిన ఎన్టీఆర్..దేవర గురించి చెబుతూ..దేవర అనే చిత్రం లేట్ అయినా కూడా అభిమానులు కాలర్ ఎగిరేసేలానే ఉంటుందని ఆయన తెలిపారు.దీంతో ఎన్టీఆర్ కావాలని చెబుతున్నారో లేదా యాదృశ్చికంగా చెప్పారో తెలియదు కానీ..పదే పదే జగన్ డైలాగ్ లు ఎన్టీఆర్ నోటి వెంట వస్తుండడం తో వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటుంటే..టీడీపీ శ్రేణులు మాత్రం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మీరు మాత్రం దేవర ట్రైలర్ ఫై మరోసారి లుక్ వెయ్యండి.

Read Also : Prakasam Barrage Boats Crash Case : జగన్ అంటే భయం వల్లే ఇలాంటి కుట్రలు-అంబటి రాంబాబు

  Last Updated: 10 Sep 2024, 09:55 PM IST