Megha Akash : పెళ్లి పీటలు ఎక్కబోతున్న మేఘ ఆకాష్..?

సంప్రదాయ పద్దతిలో చీర కట్టుకుని, తన చేతులకున్న మెహందిను చూపిస్తున్న ఫోటోలను షేర్ చేసింది

  • Written By:
  • Publish Date - April 25, 2024 / 10:48 PM IST

ఈ మధ్య చిత్రసీమలో వరుసపెట్టి హీరోలు , హీరోయిన్స్ , సైడ్ క్యారెక్టర్లు ఇలా ప్రతి ఒక్కరు తమ బ్యాచ్లర్ లైఫ్ కు గుడ్ బై చెప్పి పెళ్లి చేసుకొని ఓ ఇంటివారు అవుతున్నారు. ఇప్పటికే పలువురు పెళ్లి పీటలు ఎక్కగా..మరికొంతమంది ఎంగేజ్మెంట్ చేసుకొని పెళ్ళికి సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలో మరో యంగ్ హీరోయిన్ మేఘ ఆకాష్ పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది. నితిన్ నటించిన ‘లై’ సినిమాతో వెండితెరకి పరిచయమైన ఈ బ్యూటీ ..ఆ తర్వాత ఛల్ మోహన్ రంగ, డియర్ మేఘా, ప్రేమ దేశం, రాజ రాజ చోర, గుర్తుందా సీతాకాలం, రావణాసుర, మను చరిత్ర వంటి చిత్రాల్లో యాక్ట్ చేసినప్పటికీ అవేవి బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ కాకపోయేసరికి అమ్మడు అంతగా వార్తల్లో నిలవలేకపోయింది. ఇక ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కబోతుందనే వార్త అమ్మడిని వార్తల్లో నిలిచేలా చేసింది.

We’re now on WhatsApp. Click to Join.

తన సోషల్ మీడియాలో సంప్రదాయ పద్దతిలో చీర కట్టుకుని, తన చేతులకున్న మెహందిను చూపిస్తున్న ఫోటోలను షేర్ చేసింది. అలాగే ఈ ఫొటోస్ కు #weddingvibes అనే హాష్ ట్యాగ్ జోడించేసరికి అందరూ ఈమె పెళ్లి చేసుకోబోతుందని ఫిక్స్ అవుతున్నారు. అయితే గత ఏడాది కూడా మేఘ ఆకాశ్​ పెళ్లిపై రకరకాల వార్తలు వచ్చాయి. మేఘ చెన్నైకి చెందిన వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోబోతుంది అంటూ మీడియాలో న్యూస్ వచ్చింది అయితే వాటి గురించి మేఘ కుటుంబం నుంచి ఎటువంటి స్పందనా రాలేదు. ఇప్పుడు కూడా అటువంటి వార్తలా లేక నిజంగానే ఈ అమ్మడు పెళ్లికి సిద్ధం అయిందా అని అందరూ అనుకుంటున్నారు. మరి నిజముగా ఈమె పెళ్లి చేసుకుంటుందా..? లేక ఏదైనా షూటింగ్ కు సంబదించినవా..? అనేది క్లారిటీ రావాల్సి ఉంది.

Read Also : Shruti Haasan : శృతి హాసన్ ..రెండో బాయ్‌ఫ్రెండ్‌కు కూడా బై బై చెప్పిందా..?