Site icon HashtagU Telugu

Anjali : తెలుగు నిర్మాతతో అంజలి పెళ్లి..? ఏడాదిగా డేటింగ్ కూడా..?

Anjali

Anjali

తెలుగు అమ్మాయి అయిన అంజలి (Anjali) ఇక్కడ ఫోటో సినిమాతో తెరంగేట్రం చేసి ఆ తర్వాత తమిళంలో ఛాన్సులు అందుకుంది. కోలీవుడ్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాక మళ్లీ టాలీవుడ్ రీ ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా తర్వాత్ అంజలి ఇక్కడ సూపర్ ఫాలోయింగ్ ఏర్పరచుకుంది. ఆ సినిమా తర్వాత వరుస అవకాశాలు అందుకుంది. స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశం ఉన్నా తన సినిమాల సెలక్షన్ వల్ల టైర్ 2 హీరోలతోనే సరిపెట్టుకుంది అమ్మడు.

అంజలి తెర మీద విశేషాల కన్నా ఆఫ్ స్క్రీన్ వార్తలు సంథింగ్ స్పెషల్ గా ఉంటాయి. కోలీవుడ్ హీరోతో లవ్ స్టోరీ, డేటింగ్ అంటూ కొన్ని వార్తలు రాగా వాటిని లైట్ తీసుకుంది. తెలుగులో ఇప్పుడు మళ్లీ వరుస ఛాన్సులు అందుకుంటున్న అంజలి డేటింగ్ పై మరో వార్త వైరల్ గా మారింది. ఓ నిర్మాతతో అంజలి ఏడాది పాటు డేటింగ్ లో ఉందని.. త్వరలోనే ఆ నిర్మాతను పెళ్లాడుతుందని చెప్పుకుంటున్నారు.

అంజలి కోసం ఆ నిర్మాత తన భార్యకు డైవర్స్ కూడా ఇచ్చాడని టాక్. ఇంతకీ ఆ నిర్మాత ఎవరు..? అతనితో అంజలి డేటింగ్ న్యూస్ నిజమేనా అన్నది తెలియాల్సి ఉంది. అంజలి మళ్లీ తెలుగులో బిజీ అవుతున్న ఈ టైం లో ఆమె డేటింగ్ రూమర్స్ వైరల్ గా మారాయి. ప్రస్తుతం అంజలి నటించిన గీతాంజలి మళ్లీ వచ్చింది, గేం చేంజర్ సినిమాలు చేస్తుంది.

Also Read : Srileela Kurchi Madatapetti : కోలీవుడ్ హీరోతో కుర్చీ మడతపెట్టి స్టెప్పేసిన శ్రీలీల.. వీడియో వైరల్..!

Exit mobile version