Ibomma – Telugu Producers : యాక్టర్లకు, ప్రొడ్యూసర్లకు ‘ఐబొమ్మ’ నీతులు.. లేఖ వైరల్

Ibomma - Telugu Producers : చట్టవిరుద్ధంగా పైరసీ సినిమాలను ప్రదర్శించే ‘iBOMMA’ వెబ్‌సైట్ నీతులు చెబుతూ ఓ లేఖను విడుదల చేసింది.

  • Written By:
  • Publish Date - September 8, 2023 / 01:49 PM IST

Ibomma – Telugu Producers : చట్టవిరుద్ధంగా పైరసీ సినిమాలను ప్రదర్శించే ‘iBOMMA’ వెబ్‌సైట్ నీతులు చెబుతూ ఓ లేఖను విడుదల చేసింది. పెద్ద ఎత్తున ఇండియా సినిమాలను తమ వెబ్ సైట్ లో డిస్ ప్లే చేసే ఈ పైరసీ వెబ్ సైట్.. తాము భారత్ లో కార్యకలాపాలు చేయడం లేదని స్పష్టం చేసింది. అంతటితో ఊరుకోకుండా తెలుగు సినిమాల ప్రొడ్యూసర్లకు, యాక్టర్లకు నీతిబోధ కూడా చేసింది. నటులు, నటీమణులు తీసుకునే ఫీజులను తగ్గిస్తే టికెట్ల ధరలు వాటంతట అవే తగ్గిపోతాయని ఐబొమ్మ కామెంట్ చేసింది. టికెట్ల ధరలను తగ్గించేందుకు.. షూటింగ్ లను విదేశాల్లో చేయడం కూడా ఆపాలని ప్రొడ్యూసర్లను డిమాండ్ చేసింది.

Also read : AP ACB – Bumper Offer : ఏపీ ఏసీబీ బంపర్ ఆఫర్.. ఏమిటో తెలుసా ?

మూవీ తీయడానికి అయ్యే అనవసర ఖర్చుల వల్లే.. డబ్బును రికవరీ చేసేందుకు డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యజమానులు టిక్కెట్ల ధరలను పెంచుతున్నారని పేర్కొంది. ఈమేరకు ఐబొమ్మ ఓ లేఖను విడుదల చేసిందంటూ ప్రముఖ జాతీయ మీడియా సంస్థలో కథనం ప్రచురితమైంది. ఒక సోషల్ మీడియా వినియోగదారుడు ఐబొమ్మ విడుదల చేసిన లేఖను స్క్రీన్ షాట్‌ తీసి ట్వీట్ చేయడంతో అది వైరల్ గా మారిందని కథనంలో పేర్కొన్నారు.‘‘పోగొట్టుకోవడానికి ఏమీ లేని మనిషి కంటే.. ప్రమాదకరమైనది మరొకటి లేదు’’ అని ఈ లేఖలో ఐబొమ్మ కామెంట్ చేయడం గమనార్హం.  మోసపూరిత IBomma వెబ్‌సైట్‌లతో తమకు సంబంధం లేదని (Ibomma – Telugu Producers)  ఆ లేఖలో తేల్చి చెప్పింది.