Pawan Kalyan : వామ్మో.. మహారాష్ట్రలో కూడా పవన్ కు మాస్ ఫాలోయింగ్.. ఆ జనాలు ఏంట్రా బాబు..

పవన్ క్రేజ్ ని బీజేపీ వాడుకుంటుంది.

Published By: HashtagU Telugu Desk
Huge Fans and people Attending to Pawan Kalyan Road Shows and Public Meetings in Maharastra

Pawan Kalyan Maharastra

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ తెలిసిందే. ఆయన సభ పెట్టినా, రోడ్ షో చేసినా జనాలు, ఫ్యాన్స్ భారీగా వస్తారు. ఇటీవల ఏపీ ఎన్నికల్లో భారీగా గెలవడం, పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ గెలవడంతో పవన్ పేరు దేశమంతా మారుమ్రోగింది. దానికి తోడు నరేంద్రమోడీ నేషనల్ మీడియా ముందు జాతీయ సభలో ఇతను పవన్ కాదు సునామి అంటూ పొగడటంతో వేరే రాష్ట్రాల్లో కూడా పవన్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. వేరే రాష్ట్రాల్లోని రాజకీయ నాయకులు కూడా పవన్ ని తెగ పొగిడేస్తున్నారు.

దీంతో పవన్ క్రేజ్ ని బీజేపీ వాడుకుంటుంది. త్వరలో మహారాష్ట్రలో ఎన్నికలు జరుగుతుండటంతో అక్కడ NDA తరపున పవన్ కళ్యాణ్ తో ప్రచారం చేయిస్తున్నారు. దీంతో పవన్ ప్రస్తుతం మహారాష్ట్రలోని పలు నియోజకవర్గాల్లో NDA అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్నారు. రోడ్ షోలు, సభల్లో పాల్గొంటున్నారు. అయితే పవన్ అక్కడికి వెళ్లడంతోనే NDA నాయకులు భారీ స్వాగతం పలకడం ఒక ఎత్తైతే అక్కడ పవన్ రోడ్ షోలకు, సభలకు కూడా భారీగా జనాలు రావడంతో ఆశ్చర్యపోతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లోకి కాకుండా పవన్ మొదటిసారి వేరే రాష్ట్రలో ప్రచారం చేస్తున్నాడు. మొదటి సారే ఇంత భారీగా జనాలు రావడం చూసి అక్కడి నాయకులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఇక పవన్ ఫ్యాన్స్ అయితే ఆ వీడియోలు, ఫోటోలు తెగ వైరల్ చేస్తున్నారు. మహారాష్ట్రలో కూడా పవన్ కి మాస్ ఫాలోయింగ్ చాలా ఉందని అంటున్నారు. పవన్ ప్రచారం కలిసొచ్చి NDA నాయకులు గెలిస్తే ఇప్పటికే నేషనల్ వైడ్ పవన్ కు ఉన్న గుర్తింపు మరింత పెరిగి జాతీయ నాయకుడు అవ్వడం కచ్చితమే అంటున్నారు. మొత్తానికి జనసేనాని ఎక్కడికి వెళ్లినా అక్కడికి భారీగా జనాలు వచ్చి సందడి చేస్తూ పవన్ స్థాయిని మరింత పెంచుతున్నారు.

 

Also Read : Varun Tej : వరుణ్ తేజ్ కి సినీ పరిశ్రమలో ఆ హీరో ఒక్కడే ఫ్రెండ్ అంట.. ఎవరా హీరో?

  Last Updated: 17 Nov 2024, 10:47 AM IST