Vijay Antony: బిచ్చగాడు మూవీ హీరో కాపురంలో చిచ్చు…విడాకుల దిశగా ఆంటోనీ..?

బిచ్చగాడు మూవీ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ మూవీ బిట్ హిట్ గా నిలిచింది.

  • Written By:
  • Publish Date - October 13, 2022 / 08:12 PM IST

బిచ్చగాడు మూవీ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ మూవీ బిట్ హిట్ గా నిలిచింది. ఈ మూవీ నుంచి విజయ్ ఆంటోనీకి మంచి గుర్తింపు లభించింది. అంతకు ముందు విజయ్ ఆంటోనీ పలు చిత్రాల్లో నటించినప్పటికీ అంతగా గుర్తింపు రాలేదు. బిచ్చగాడు మూవీ నుంచి తెలుగు, తమిళ్ ఇండస్ట్రిలో విజయ్ ఆంటోని ప్రతిఒక్కరికి గుర్తుండిపోయారు. కొన్ని సినిమాలు విజయ్ ప్రభావం చూపినప్పటికీ…తన పంథాలనే విభిన్న చిత్రాలు చేస్తూ ముందుకు వెళ్లాడు.

తాజాగా విజయ్ ఆంటోని వ్యక్తిగత జీవితం గురించి మీడియాలో వైరల్ అవుతోంది. విజయ్, తన భార్య ఫాతిమా మధ్య విభేధాలు వచ్చాయని..ఇద్దరూ కలిసి ఉండటంలేదన్న వార్తలు వచ్చాయి. తాజాగా ఆంటోని చేసిన ట్వీట్ ఆ అనుమానాలకు మరింత తావిచినట్లయింది. మీ ఫ్యామిలీలో విభేదాలు వస్తే మీరే పరిష్కరించుకోవాలి లేదంటే మీరు ఇద్దరూ పరిష్కరించుకోలేకపోతే…ఇల్లు వదిలి దూరంగా జీవించాలని…అంతేకానీ మూడో వ్యక్తికి ఛాన్స్ ఇవ్వకూడదు అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. విజయ్ వ్యక్తిగత జీవితం గురించి అనుమానాలు మొదలయ్యాయి. వీరిద్దరూ విడాకుల దిశగా వెళ్తున్నారన్న సందేహాలు వస్తున్నాయి. 2006లో వీరిద్దరి వివాహం జరిగింది. వారికి ఒక కుమార్తె ఉంది.