పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రాజకీయాల్లో బిజీగా ఉన్నా, అభిమానుల కోసం మరోసారి వెండితెరపై దర్శనమివ్వబోతున్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన చారిత్రాత్మక యాక్షన్ మూవీ హరిహర వీరమల్లు (Hari Hara Veeramallu) జూలై 24న గ్రాండ్‌గా విడుదల కానుంది. మేకర్స్ విడుదల చేసిన ట్రైలర్, పోస్టర్స్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. ప్రేక్షకులు ఎదురుచూస్తున్న ఈ సినిమా గురించి ప్రీమియర్ రివ్యూస్ (Hari Hara Veeramallu Review) నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది.
HHVM : వీరమల్లు హిట్ అవ్వాలని కోరుకున్న అంబటి..నిజమా..లేక సెటైరా ?
ఈ చిత్రం 17వ శతాబ్దం మొగల్ పాలన నేపథ్యంలో రూపొందింది. ముఖ్యంగా ఔరంగజేబ్ హిందువులపై అమలు చేసిన పన్నుల విధానం, దానికి హరిహర వీరమల్లు చేసిన తిరుగుబాటు ఈ చిత్రంలో ప్రధాన కథాంశంగా కనిపించబోతోంది. విజయవాడ సమీపంలోని కొల్లూర్‌లో దొరికిన కొహినూర్ వజ్రం ఎలా నిజాం నవాబ్ చేతికి చేరింది? ఆయన నుంచి బ్రిటిష్ వలసాధికారుల వద్దకు ఎలా వెళ్ళింది? అనే ఆసక్తికర కథనాలను ఫిక్షన్ నేపథ్యంలో సినిమా ఓ రేంజ్ లో ఉందని అంటున్నారు. ఇంటర్వెల్‌కు ముందు, ఆ తరువాత వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకు మెయిన్ హైలైట్‌గా నిలవనున్నాయి. పౌరాణిక వాతావరణంలో వేసిన సెట్స్, గ్రాండ్ విజువల్స్, పవన్ కళ్యాణ్ నటన సినిమాకు మరింత బలాన్నిచ్చే అంశాలుగా నిలుస్తాయని చెపుతున్నారు. ముఖ్యంగా పవన్ స్వయంగా కంపోజ్ చేసిన క్లైమాక్స్ ఫైట్ సీన్ థియేటర్లలో పూనకాలు తెప్పించేలా ఉంటుందని తేల్చి చెపుతున్నారు. ఈ సీన్‌లో ఎం.ఎం.కీరవాణి అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థియేటర్స్ లలో అభిమానుల చేత ఈలలు వేయించేస్తాయని పేర్కొంటున్నారు.
Harassment : బూతులు తిడుతూ నరకం చూపిస్తున్నారంటూ కన్నీరు పెట్టుకున్న బాలయ్య హీరోయిన్
హరిహర వీరమల్లు చిత్రానికి క్రిష్ మరియు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించారు. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా, బాబీ డియోల్, అనసూయ, అనుపమ్ ఖేర్, నోరా ఫతేహి వంటి నటులు ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదలవుతున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు చారిత్రాత్మక యాక్షన్ చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఇది ఓ విజువల్ ఫీస్ట్ కానుందని పరిశ్రమలో చర్చ నడుస్తోంది.