Site icon HashtagU Telugu

Hari Hara Veera Mallu : హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ ను ప్రకటించిన మేకర్స్

Hari Hara Veera Mallu

Hari Hara Veera Mallu

Hari Hara Veera Mallu New Release Date : పవన్ కళ్యాణ్ అభిమానులకు తీపి కబురు తెలిపారు హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) మేకర్స్. క్రిష్ (Krish) – జ్యోతికృష్ణ (JyothKrishna) – పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కలయికలో ‘హరి హర వీర మల్లు’ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రారంభమై దాదాపు మూడేళ్లు పూర్తి అవుతున్న ఇంతవరకు పూర్తి కాలేదు. ఈ సినిమా తర్వాత మొదలుపెట్టిన సినిమాలు పూర్తి అవ్వడం..రిలీజ్ అవ్వడం జరిగింది కానీ ‘హరి హర వీర మల్లు’ మాత్రం అక్కడే ఆగిపోయింది. పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీ గా ఉండడం..పీరియాడికల్ మూవీ కావడం తో ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. అసలు ఈ సినిమా రాదనే అనుకుంటున్నా తరుణంలో మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చి సంతోష పెట్టారు.

ఈరోజు ఉదయం 7 గంటలకు ఈ మూవీ షూటింగ్ ప్రారంభించినట్టు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. దీనితో ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉండగానే.. రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేసి ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చారు. హరి హర వీరమల్లు మూవీని 2025 మార్చి 28న పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. రిలీజ్ డేట్ తో పాటు.. పవన్ కళ్యాణ్ కత్తి పట్టుకున్న పోస్టర్ కూడా రివీల్ చేశారు. దీనితో ఇంకాస్త ఖుషి అవుతున్నారు ఫ్యాన్స్. 17వ శతాబ్దం నేపథ్యంలో సాగే కథతో పవన్ అభిమానులను అలరించనున్నారు. మొఘలుల కాలం నాటి చారిత్రక నేపథ్యంలో తెరకెక్కుతోంది. పవన్‌ కల్యాణ్​ ఓ వీరోచిత బందిపోటుగా కనిపిస్తారట. ఇప్పటికే విడుదలైన ఆయన లుక్స్ కూడా ఫ్యాన్స్​ను బాగా ఆకట్టుకున్నాయి. క్రిష్‌, జ్యోతికృష్ణ సంయుక్తంగా ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు.

రెండు భాగాలుగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘హరిహర వీరమల్లు పార్ట్‌ 1: స్వార్డ్‌ వర్సెస్‌ స్పిరిట్‌’ పేరుతో విడుదల కానుంది. బాబీ దేవోల్‌, అనుపమ్‌ఖేర్‌, నోరా ఫతేహి, విక్రమ్‌ జీత్‌, నిధి అగర్వాల్‌, జిషుసేన్‌ గుప్త ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి స్వరాలు అందిస్తున్న ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్స్‌ పతాకం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇప్పటికే తొలి భాగానికి సంబంధించి చిత్రీకరణ ముగింపుదశకు చేరుకుందని సమాచారం.

Read Also : Laapataa Ladies : ఆస్కార్ 2025కి కిరణ్ రావు ‘లాపతా లేడీస్’..