పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) జూలై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. అయితే, ఈ మూవీకి రిలీజ్ రోజే నెగటివ్ టాక్ రావడం తీవ్ర విచారకరం. ప్రేక్షకుల అంచనాలు అందుకోలేకపోయిన ఈ సినిమా మొదటి షో నుంచే తీవ్ర విమర్శలకు గురైంది. ముఖ్యంగా ఫ్యాన్స్ నుంచే ఈ స్థాయిలో నెగెటివ్ స్పందన రావడం చాలా కాలం తర్వాత జరిగిందని సినీ విశ్లేషకులు అంటున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ (VFX) దారుణంగా ఉండటంతో పాటు, రెండో భాగంలో సన్నివేశాల నిర్వహణ బోరుకొట్టేలా ఉందని అభిమానులు మండిపడుతున్నారు.
Benefits Of Crying: ఏడవటం కూడా ఆరోగ్యమేనా? నిపుణులు ఏం చెబుతున్నారు?!
ఈ నెగటివ్ టాక్ వచ్చినా మొదటి రోజు భారీగా బుకింగ్స్ ఉండటంతో సినిమాకు రూ. 30 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. పవన్ కళ్యాణ్ స్వయంగా ఈ విషయాన్ని సక్సెస్ మీట్ లో వెల్లడించారు. జులై 24న మొత్తం కలెక్షన్స్ దాదాపు రూ. 40 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా. అయితే ఇవన్నీ ముందస్తు బుకింగ్స్ వల్ల వచ్చాయని, రెండో రోజు నుంచి కలెక్షన్లలో భారీగా పడిపోయే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే కొన్ని థియేటర్లలో ఫ్లెక్సీలు తొలగిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Sravana Sukravaram Pooja : వరలక్ష్మీ వ్రతం పూజా విధానం.. పాటించాల్సిన నియమాలివే..!
వివాదాస్పదంగా మారిన ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలను తొలిగించేపని పెట్టుకుంది మూవీ టీమ్. ప్రత్యేకంగా వీఎఫ్ఎక్స్ సీన్లపై విమర్శలు రావడంతో హార్స్ రైడింగ్, తోడేలు, కోహినూర్ వజ్రం నేపథ్యం వంటి సన్నివేశాలను తొలగించారు. ఫలితంగా సినిమాను 2 గంటల 42 నిమిషాల నుంచి 2 గంటల 22 నిమిషాలకి కుదించారు. సీన్ల మధ్య లింక్ తడబడకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఎడిటింగ్ చేసినట్లు సమాచారం. అయినప్పటికీ, ప్రేక్షకుల్లో కలిగిన అసంతృప్తి తగ్గించడానికి ఇది చాలదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి హరిహర వీరమల్లు చిత్రం పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే ఒక పెద్ద వైఫల్యంగా నిలిచే సూచనలు కనిపిస్తున్నాయి. మరి ఈ ఎఫెక్ట్ రాబోయే సినిమాలపై ఖచ్చితంగా పడనుంది.