Celebrity Restaurants 2024 : సినీ ఇండస్ట్రీలో ఉన్నవాళ్లు రకరకాల వ్యాపారాలు చేస్తుంటారు. ప్రత్యేకించి హీరోలు, హీరోయిన్లు కూడా వివిధ బిజినెస్‌లను చేస్తుంటారు. కొందరు రియల్ ఎస్టేట్ చేస్తుంటారు. భవనాలు కొని అమ్ముతుంటారు. ఇంకొందరు ఫ్యాషన్ డిజైనింగ్ సంబంధిత వ్యాపారాలు చేస్తుంటారు. మరికొందరు బ్యూటీ ప్రోడక్ట్స్‌తో ముడిపడిన బిజినెస్‌లు చేస్తారు. 2024 సంవత్సరంలో బాలీవుడ్ సెలబ్రిటీలు ఏర్పాటు చేసిన రెస్టారెంట్లు, ఫుడ్ షాప్‌ల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
Also Read :Pakistan Vs Taliban : ఆఫ్ఘనిస్తాన్‌పై పాక్ వైమానిక దాడులు.. 15 మంది మృతి.. ప్రతీకారం తీర్చుకుంటామన్న తాలిబన్లు
మలైకా అరోరా అండ్ అర్హాన్ ఖాన్
మలైకా అరోరా, ఆమె కుమారుడు అర్హాన్ ఖాన్ కలిసి 2024 సంవత్సరంలో స్కార్లెట్ హౌస్(Celebrity Restaurants 2024) పేరుతో రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశారు. దీన్ని ముంబైలోని జుహు ప్రాంతంలో ఏర్పాటు చేశారు. ఈ రెస్టారెంట్‌లో ఆసియా, మధ్యప్రాచ్య, మధ్యధరా ప్రాంత ఫుడ్స్ స్పెషల్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వంటకాలను అందించడం ఈ రెస్టారెంట్ ప్రత్యేకత.
రకుల్ ప్రీత్ సింగ్
రకుల్ ప్రీత్‌సింగ్ హైదరాబాద్‌లో రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో ‘ఆరంబం’ పేరుతో ఆమె రెస్టారెంట్ ఏర్పాటైంది. దీనిలో పార్ట్‌నర్‌గా క్యూర్ ఫుడ్స్ సంస్థ ఉంది. మిల్లెట్లతో కూడిన ఫుడ్ ఐటమ్స్‌ను అందించడం ‘క్యూర్ ఫుడ్స్’ సంస్థ ప్రత్యేకత. మిల్లెట్లతో కూడిన వివిధ రకాల రుచికరమైన వంటకాలను అందించడం ‘ఆరంబం’ రెస్టారెంట్ స్పెషాలిటీ.
సన్నీ లియోన్
బాలీవుడ్ నటి సన్నీ లియోన్ కూడా రెస్టారెంట్ వ్యాపారంలోకి దిగారు. ఆమె నోయిడాలో తన కొత్త రెస్టారెంట్ చికా లోకాను ప్రారంభించారు. ఈ రెస్టారెంట్‌లో ఆసియా ప్రాంత ప్రత్యేక వంటకాలన్నీ లభిస్తాయి. ప్రత్యేక కాక్‌టెయిల్స్ సైతం అందుబాటులో ఉంటాయి. పంజాబ్, హైదరాబాద్, గోవాలలో కూడా రెస్టారెంట్లను ఏర్పాటు చేయాలని సన్నీ లియోన్ భావిస్తున్నారు.
ఈషా గుప్తా
ప్రముఖ నటి ఈషా గుప్తా కూడా రెస్టారెంట్ వ్యాపారాన్ని మొదలుపెట్టారు. ఆమె 2024 సంవత్సరం మే నెలలో స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో తన రెస్టారెంట్‌ను ప్రారంభించారు. దాని పేరు.. ‘కాసా సేల్‌సాస్’. ఇందులో స్పానిష్ బ్రంచ్‌లు, ఆరోగ్యకరమైన వంటకాలు, చక్కటి వైన్‌లు, వెరైటీ కాఫీలు లభిస్తాయి. ఇక్కడ లభించే వంటకాల లిస్టులో.. అల్కా ఖోఫాస్, తార్తా డీ క్వెసో, పోలో ఉన్నాయి.
గౌరీ ఖాన్
హీరో షారుఖ్ ఖాన్ భార్య, ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ గౌరీ ఖాన్ కూడా రెస్టారెంట్ వ్యాపారాన్ని మొదలుపెట్టారు. ఆమె రెస్టారెంట్ పేరు ‘టోరీ’. ముంబైలోని బాంద్రా ఏరియాలో దీన్ని ఏర్పాటు చేశారు. ఈ రెస్టారెంట్‌లో జపనీస్ వంటకాలు, సుషీ వంటకం, వివిధ రకాల కాక్ టెయిల్స్ లభిస్తాయి. ఈ రెస్టారెంట్‌లోని ఇంటీరియర్స్‌ను స్వయంగా గౌరీఖాన్ డిజైన్ చేశారట.