Pushpa Raj : సోలోగానే పుష్ప రాజ్.. ఆ సాహసం ఎవరు చెయ్యట్లేదు..!

Pushpa Raj స్టార్ సినిమాలు రిలీజ్ డేట్ క్లాషెస్ గురించి తెలిసిందే. సినిమా అనౌన్స్ మెంట్ రోజే ఫలానా డేట్ అని రిలీజ్ డేట్ ప్రకటిస్తారు. కానీ రిలీజ్ టైం దగ్గర పడుతుండగా అది వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వస్తుంటారు.

Published By: HashtagU Telugu Desk
Fight with Pushpa Raj It is Very Risk

Fight with Pushpa Raj It is Very Risk

Pushpa Raj స్టార్ సినిమాలు రిలీజ్ డేట్ క్లాషెస్ గురించి తెలిసిందే. సినిమా అనౌన్స్ మెంట్ రోజే ఫలానా డేట్ అని రిలీజ్ డేట్ ప్రకటిస్తారు. కానీ రిలీజ్ టైం దగ్గర పడుతుండగా అది వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వస్తుంటారు. పెద్ద బడ్జెట్ సినిమాలు అనుకున్న విధంగా మార్కెట్ రీచ్ అవ్వాలంటే రిలీజ్ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఈ క్రమంలో ఈ ఏడాది రాబోతున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీస్ లో ఒకటైన పుష్ప 2 సినిమా ప్రతి అప్డేట్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించేస్తుంది.

సినిమా నుంచి ఈమధ్యనే వచ్చిన అల్లు అర్జున్ టీజర్ అయితే గూస్ బంప్స్ తెప్పించేసింది. సుకుమార్ ఈ సీక్వల్ పై ఎన్ని అంచనాలు ఉన్నా దానికి ఒక అడుగు పైగ ఉండేలా చూస్తున్నాడు. అయితే పుష్ప 2 సినిమా ఆగష్టు 15న రిలీజ్ లాక్ చేయగా ఆ సినిమాకు పోటీగా కొన్ని సినిమాల రిలీజ్ లు ప్లాన్ చేశారు. ముందుగా కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ తను నటిస్తున్న జి.ఓ.ఏ.టి సినిమాను మొదట ఆగష్టు 15న రిలీజ్ చేయాలని అనుకున్నారు.

కానీ ఆ డేట్ న పుష్ప వస్తున్నాడని తెలిసి సెప్టెంబర్ 5కి సినిమా వాయిదా వేసుకున్నారు. ఇక మరోపక్క బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ కూడా సింగం సీరీస్ లో భాగంగా చేస్తున్న సినిమా సింగం 3 ని కూడా ఆగష్టు 15న రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ పాన్ ఇండియా లెవెల్ లో పుష్ప 2 కి వస్తున్న బజ్ చూసి ఆ సినిమాను కూడా వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.

సో పుష్ప రాజ్ మాత్రం సోలోగానే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాదని పుష్ప రాజ్ కు పోటీగా వచ్చినా ఏ సినిమా అయినా నిలబడటం కష్టమే. పుష్ప 1 తో ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ అందుకున్న అల్లు అర్జున్, సుకుమార్ పుష్ప 2 తో దాన్ని మించే హిట్ అందుకుంటారా లేదా అన్నది చూడాలి.

Also Read : Rajinikanth Jailer 2 : జైలర్ 2 కి అదిరిపోయే టైటిల్.. డబుల్ ఇంపాక్ట్ పక్కా..!

  Last Updated: 12 Apr 2024, 11:03 PM IST