Bigg Boss 6: ఎవిక్షన్ ఫ్రీ పాస్ గెలుచుకున్న ఫైమా.. నడవలేని స్థితిలో రేవంత్, శ్రీహాన్?

తెలుగులో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 రోజురోజుకి ఇంట్రెస్టింగ్ గా మారుతోంది. తాజాగా బిగ్ బాస్ కంటెస్టెంట్లకు

  • Written By:
  • Publish Date - November 19, 2022 / 03:12 PM IST

తెలుగులో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 రోజురోజుకి ఇంట్రెస్టింగ్ గా మారుతోంది. తాజాగా బిగ్ బాస్ కంటెస్టెంట్లకు ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్ ని నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ టాస్క్ లో భాగంగా ఫైమా, రేవంత్, శ్రీ హాన్ లు పాల్గొన్నారు. ఇక ఈ టాస్క్ లో భాగంగా ముగ్గురు పోటీదారులు బజర్ మోగినప్పటి నుంచి వారి భుజాలపై ఒక పొడవాటి పైపు లాంటిది పెట్టుకుని నిలబడాలి. ఆ తర్వాత బజార్లు మోగిన ప్రతిసారి మిగిలిన ఇంటి సభ్యులు ఒక్కొక్కరుగా ఎవరికి పాస్ అవసరం లేదు అనుకుంటున్నారు వారి పైపులకు వెళ్లి ఆ పక్కనే ఉన్న ఆ ఇసుక బస్తాలని తగిలించాలి. ఈ టాస్క్ లో బాగంగానే ఎక్కువగా రేవంత్ శ్రీహాన్ కె ఎక్కువ ఇసుక బస్తాలు వేశారు.

ఫైమా కు కేవలం రెండు ఇసుక బస్తాలు మాత్రమే వస్తాయి. అయితే శ్రీ సత్య తప్ప మిగిలిన కంటెస్టెంట్లు అందరూ టాస్క్ లో ఉన్న కంటెస్టెంట్ లకు ఇసుక బస్తాలు తగిలిస్తారు. అయితే ఇసుక బస్తాలు ఎక్కువగా బరువు ఉండడంతో మోయలేక మొదట శ్రీహాన్ కింద పడిపోతాడు. ఆ తర్వాత శ్రీహాన్ కు ధైర్యం చెప్పిన శ్రీ రేవంత్ కొద్దిసేపటికి ఆ నొప్పిని భరించలేక కింద పడిపోతాడు. చివరికి పైమా ఈ టాస్క్ లో గెలుస్తుంది. దీంతో ఫైమా ఎవిక్షన్ ఫ్రీ పాస్ ను సొంతం చేసుకుంది. ఎంతో కఠినంగా కష్టతరంగా ఈ ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్ ని ఆడిన రేవంత్ శ్రీహన్ లు గార్డెన్ ఏరియాలో పడిపోయారు.

వారిద్దరూ చాలా సేపు లేవలేని స్థితిలో కనిపించారు. అంతసేపు అంత కష్టపడినా సరే వారిద్దరికీ రాకపోయేసరికి ఇద్దరు ఏడ్చేశారు. ఆ తర్వాత రేవంత్ రాత్రి బెడ్ పై పడుకుని ఎమోషనల్ అవుతూ రెస్ట్ తీసుకుంటూ ఉండగా ఇంతలో ఇనయా అక్కడికి వెళ్లి రేవంత్ ని ఓదార్చింది. ఎంతో బాగా ఆడావు అంత నొప్పిని భరించావు అంటూ రేవంత్ ని మెచ్చుకుంది.