Site icon HashtagU Telugu

Jr NTR : జూనియర్ ఎన్‌టీఆర్‌‌కు ప్రైవేటు విమానం ఉందా ?

Jr Ntr Private Plane Jr Ntr Assets Private Jet

Jr NTR : హృతిక్ రోషన్‌తో కలిసి మల్టీస్టారర్ మూవీ ‘వార్2’లో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఈ సినిమా  ఆగస్టు 14న విడుదల కానుంది. యశ్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ఈ భారీ యాక్షన్ అడ్వెంచర్ రూపుదిద్దుకుంటోంది.  ఈనేపథ్యంలో ఇప్పుడు బాలీవుడ్ మీడియా జూనియర్ ఎన్టీఆర్ గురించి పుంఖాను పుంఖాలుగా వార్తలు రాస్తోంది. తారక్‌కు ఉన్న ఆస్తుల గురించి ఆయా కథనాల్లో ప్రస్తావిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్‌కు ప్రైవేటు జెట్ కూడా ఉందని ఓ కథనంలో ప్రస్తావించారు. ఆ వివరాలపై ఓ లుక్ వేద్దాం..

Also Read :Mithun Reddy : ఏపీ లిక్కర్ స్కాంలో మిథున్ రెడ్డి పాత్ర.. కీలక వివరాలివీ

ఖండించని తారక్ టీమ్

జూనియర్ ఎన్‌టీఆర్‌కు ఒక ప్రైవేటు జెట్ ఉందని, దాని విలువ రూ.80 కోట్లు అని బాలీవుడ్ మీడియా కథనాల్లో పేర్కొన్నారు. ఆయన తన ఫ్యామిలీతో కలిసి దూర ప్రాంతాలకు వెళ్లేందుకు  ప్రైవేటు జెట్‌నే వాడుతారని రాసుకొచ్చారు. ఇప్పటివరకైతే ఈ వార్తను తారక్ టీం ఖండించలేదు. దీంతో తమ అభిమాన హీరోకు జెట్ ఉందనే అభిప్రాయానికి జూనియర్ ఎన్‌టీఆర్ అభిమానులు వచ్చారు.

Also Read :Pakistan Vs IndiGo : ‘ఇండిగో‌’పై పాక్ నిర్దయ.. 227 మంది ప్రాణాలతో చెలగాటం.. ఏమైందంటే ?

బాలీవుడ్ మీడియా కథనాల్లో ఇంకా ఏముంది ?