Priyanka Chopra: వామ్మో.. ప్రియాంక చోప్రా ధరించిన నెక్లెస్ అన్ని రూ. కోట్లా?

బాలీవుడ్ గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన నటించి

  • Written By:
  • Publish Date - May 2, 2023 / 08:24 PM IST

బాలీవుడ్ గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకున్న ప్రియాంక చోప్రా ప్రస్తుతం హాలీవుడ్ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతోంది. ప్రస్తుతం హాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా రాణిస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఒక వేడుకలో పాల్గొన్న ప్రియాంక చోప్రా ఆమె ధరించిన నెక్లెస్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తైన చర్చలు కొనసాగుతున్నాయి. చాలామంది నెటిజన్స్ ఆ నెక్లెస్ ఖరీదు తెలిసి నోరెళ్ళ పెడుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

అంతర్జాతీయ ప్రతిష్ఠాత్మక ఫ్యాషన్‌ వేడుక మెట్‌ గాలా లో ప్రముఖ నటి ప్రియాంక చోప్రా పాల్గొంది. నలుపు, తెలుపు రంగు డ్రెస్ కు మ్యాచ్ గా మెడలో వజ్రాల నెక్లెస్‌తో రెడ్‌ కార్పెట్‌పై మెరిసింది. కాగా అందరి చూపులు ఆమె నెక్లెస్ పై పడ్డాయి. అంతేకాకుండా ప్రియాంక చోప్రా ఆ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే ప్రియాంక చోప్రా ధరించిన ఆ నెక్లెస్ ఖరీదు ధరిస్తే మాత్రం నిజంగా షాక్ అవడం ఖాయం. చూడటానికి ఎంతో సింపుల్ గా కనిపిస్తున్న ఆ నెక్లెస్ దాదాపుగా రూ.204 కోట్లకు పైనే ఉంటుందని తెలుస్తోంది. వజ్రాలతో పొదిగి ఉన్న ఆ వజ్రాల హారం ధర తెలిసి నెటిజన్స్ అభిమానులు షాక్ అవుతున్నారు.

Priyanka

ఈ ఏడాది మెడ్‌ గాలా లో ప్రియాంక ఇటలీకి చెందిన ప్రముఖ ఆభరణాల సంస్థ బల్గరీ రూపొందించిన 11.6 క్యారట్ల వజ్రాల నెక్లెన్‌ను ధరించింది. ఆ నెక్లెస్ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. ప్రియాంక ధరించిన నెక్లెస్‌ ధర 25 మిలియన్‌ డాలర్లు ఉంటుందని తెలుస్తోంది. అనగా మన ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపుగా రూ.204 కోట్లకు పై మాటే. మెట్‌ గాలా పూర్తయిన తర్వాత ఈ నెక్లెస్‌ను వేలం వేయనున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో ఈ ముద్దుగుమ్మ ఖరీదైన వస్తువులు ఆభరణాలను ధరించి ఎక్కువగా సోషల్ మీడియాలో నిలుస్తోంది. కాగా ప్రియాంక చోప్రా తన కంటే చిన్నవాడైన అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్ ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు తన భర్తకు సంబంధించిన ఫోటోలను వీడియోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.