తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్’ (Gaddar Awards) కార్యక్రమం విజయవంతం కావడం పట్ల ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (FDC) ఛైర్మన్, ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు (Dil Raju) సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎఫ్‌డీసీ ఎండీ హరీశ్ ఐఏఎస్‌తో కలిసి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ఈ గ్రాండ్ ఈవెంట్‌ను ఎంతో భిన్నంగా నిర్వహించిన తీరుపై రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవార్డులు అందుకోవడం గర్వంగా ఉందని తెలిపారు.
WTC 2025-27 Schedule: డబ్ల్యూటీసీ 2025-27 పూర్తి షెడ్యూల్ ఇదే.. 9 జట్లు మొత్తం 71 మ్యాచ్‌లు!
ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, మహేష్ బాబు, ప్రభాస్ వంటి అగ్రహీరోలు గైర్హాజరు కావడంపై దిల్ రాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎవరిపేరూ ప్రస్తావించకపోయినా, భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి గౌరవం వచ్చినా సెలబ్రిటీలు అందులో పాల్గొనాలని సూచించారు. ఇది ప్రభుత్వ గౌరవమే కాదు, తెలుగు సినీ పరిశ్రమ ప్రతిష్టకు సంబంధించిన విషయం అని పరోక్షంగా స్పష్టం చేశారు.
గద్దర్ అవార్డ్స్‌కు ప్రారంభంలో కేవలం ఒక గంట సమయం కేటాయించినప్పటికీ, తన వినతిని మన్నించి సీఎం రేవంత్ రెడ్డి రెండు గంటల 15 నిమిషాలపాటు ఈ వేడుకలో పాల్గొన్నారని దిల్ రాజు తెలిపారు. ఇది కళాకారుల పట్ల, సినిమా పరిశ్రమ పట్ల సీఎం చూపుతున్న గౌరవానికి నిదర్శనమని చెప్పారు. చిన్న చిన్న లోపాలుంటే ఎఫ్‌డీసీ తరఫున క్షమాపణలు కోరారు. అలాగే సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కూడా కృతజ్ఞతలు తెలిపారు.