Deepika Padukone Discharged: బాలీవుడ్ నటి దీపికా పదుకొణె (Deepika Padukone) మరియు రణవీర్ సింగ్‌లకు సెప్టెంబర్ 8న ఆడబిడ్డ పుట్టింది. ఈ రోజు వరకు ఈ జంట ముంబైలోని ఆసుపత్రిలో ఉన్నారు. ఈ రోజు ఆదివారం మధ్యాహ్నం తన కుమార్తె(Daughter) మరియు భర్తతో కలిసి ప్రసూతి వార్డు నుండి ఇంటికి బయల్దేరారు. ఆస్పత్రి నుంచి బయటకు వస్తున్న సమయంలో తీసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రణవీర్ తల్లిదండ్రులు మరో కారులో వెంబడిస్తూ కనిపించారు.
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ శనివారం సాయంత్రం ముంబై ఆసుపత్రి దీపికా దంపతులను కలిసి మాట్లాడారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ కూడా ఈ జంటని కలిశారు.దీపికా పదుకొణె ఆస్పత్రి నుంచి బయటకు వచ్చే సమయంలో గాజులు, తెల్లటి దుస్తులు ధరించి కనిపించింది. ఆమె లుక్ అభిమానులకు యే జవానీ హై దీవానీని గుర్తు చేసింది. నైనా సినిమా ఫస్ట్ హాఫ్‌లో కళ్లద్దాలు పెట్టుకున్నది. ఈ రోజు కూడా ఆమె అదే లుక్ లో కనిపించింది.
దీపికా పదుకొణె, రణ్‌వీర్ సింగ్ త్వరలో ‘సింగమ్ ఎగైన్’లో కలిసి నటించనున్నారు. ఈ కాప్ యూనివర్స్ చిత్రంలో వీరిద్దరూ పోలీస్ అవతారంలో కనిపించనున్నారు. కాగా దీపికా తొలిసారి పోలీస్ ఇన్‌స్పెక్టర్ పాత్రలో కనిపించనున్నారు. ఇకపోతే దీపికా-రణవీర్ 2018 సంవత్సరంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. చాలా కాలం పాటు డేటింగ్ చేసిన తరువాత, ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పెళ్లైన 6 సంవత్సరాల తర్వాత, వారిద్దరూ ఒక పాపకు జన్మనిచ్చారు.