Spirit : రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రాబోతున్న భారీ సినిమా ‘స్పిరిట్’. ఈ సినిమాలో హీరోయిన్‌గా దీపిక పదుకొణెను ఫైనల్ చేశారని మొదట వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు ఆమెను తప్పించి, ఆమె స్థానంలో ‘యానిమల్’ ఫేమ్ త్రిప్తి డిమ్రీకి ఛాన్స్ ఇచ్చారు. ఇందుకు కారణం దీపిక డిమాండ్ చేసిన భారీ రెమ్యునరేషన్ అని సమాచారం. కొన్ని కండీషన్లు కూడా పెట్టడంతో సందీప్ అసహనానికి లోనయ్యారట. దీంతో ఆమెను సినిమాకు దూరంగా పెట్టేశారట.
Bandi Sanjay : కల్వకుంట్ల సినిమాకు..కాంగ్రెస్ ప్రొడక్షన్: బండి సంజయ్
ఈ నేపథ్యంలో దీపిక పీఆర్ టీం ‘స్పిరిట్’ స్టోరీని లీక్ చేసిందనే మాట బయటకొచ్చింది. దీనిపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సోషల్ మీడియాలో అసహనం వ్యక్తం చేశారు. “డర్టీ పీఆర్ గేమ్స్ ఆడొద్దు” అంటూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీని తర్వాత దీపిక పేరు వరుసగా నెట్టింట చర్చనీయాంశమవుతోంది. ఇప్పుడీ పరిణామాలపై దీపిక ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. “ఒక దర్శకుడు నన్ను కలిసి ఓ కథ చెప్పారు. చాలా బాగా నచ్చింది. అయితే రెమ్యునరేషన్ విషయంలో నేను చెప్పిన మొత్తాన్ని వాళ్లు మేనేజ్ చేయలేకపోయారు. అందుకే నేను నో చెప్పాను” అని చెప్పింది.
ఇదిలా ఉంటే, ఇప్పుడు దీపిక మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు జంప్ అయిందట. అట్లీ డైరెక్షన్‌లో, అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కబోతున్న ఓ భారీ సినిమాలో హీరోయిన్‌గా దీపికని తీసుకున్నారట. ఇటీవలే ఆమె ‘కల్కి’ మూవీలో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పుడు బన్నీతో స్క్రీన్ షేర్ చేయబోతోంది.
Theatre Bandh Issue : పవన్ కళ్యాణ్ హెచ్చరికను పట్టించుకోము – సి కళ్యాణ్