Dasara Box office: బాక్సాఫీస్ దుమ్మురేపుతున్న దసరా.. 100 కోట్ల క్లబ్ లోకి నాని మూవీ!

కేవలం రెండు రోజుల్లోనే 53 కోట్లు రాబట్టిన Dasara మూవీ తాజాగా వంద కోట్ల క్లబ్ లోకి ఎంటరై టాలీవుడ్ రికార్డులను తిరుగరాస్తోంది.

  • Written By:
  • Updated On - April 6, 2023 / 03:13 PM IST

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని (Nani) నటించిన దసరా (Dasara) మూవీ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. కేవలం రెండు రోజుల్లోనే 53 కోట్లు రాబట్టిన ఈ మూవీ తాజాగా వంద కోట్ల క్లబ్ లోకి ఎంటరై టాలీవుడ్ రికార్డులను తిరుగరాస్తోంది. శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో నాని, కీర్తి సురేశ్‌ జంటగా నటించిన ‘దసరా’ తెలుగు రాష్ట్రాల్లో ఊహించని కలెక్షన్లు సాధిస్తోంది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్‌ వద్ద 100 కోట్లు వసూళ్లు చేసినట్లు చిత్రబృందం తెలిపింది.

దసరా లెక్కలు ఇవే

తెలుగు రాష్ట్రాల్లో ద‌స‌రా (Dasara) సినిమాకు దాదాపు రూ.40 కోట్లకు పైగా షేర్ వ‌సూళ్లు వ‌చ్చాయ‌ని, అలాగే కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా ఏరియాల్లో రూ.5 కోట్లు.. నార్త్ ఇండియాలో రూ.2 కోట్లు.. ఇత‌ర భాష‌ల్లో రూ.1.50 కోట్లు.. ఓవ‌ర్ సీస్‌లో రూ.9.50 కోట్లు షేర్ వ‌సూళ్లు (Collections) వ‌చ్చాయ‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి. మొత్తం రూ.58 కోట్లు షేర్ క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి. ఇక గ్రాస్ ప్ర‌కారం చూస్తే ఈ క‌లెక్ష‌న్స్ రూ.100 కోట్ల‌ను ద‌సరా సినిమా క్రాస్ చేసింది. సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.48 కోట్లు జ‌రిగాయి. రూ.49 కోట్లు వ‌స్తే డిస్ట్రిబ్యూట‌ర్స్ సేఫ్ సైడ్ అవుతార‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెప్పాయి. ఆ లెక్క‌లో చూస్తే ఇప్పుడీ చిత్రానికి రూ.7 కోట్లు లాభాలు వ‌చ్చాయి.

డైరెక్టర్ తండ్రి ఎమోషనల్

తాజాగా కరీం నగర్ జిల్లాలో దసరా బ్లాక్ బస్టర్ దావత్ పేరుతో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ వేడుకకు మంత్రి గంగుల కమలాకర్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. అయితే ఈ సందర్భంగా శ్రీకాంత్ తండ్రి చంద్రశేఖర్, తల్లి, సోదరుడు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి తమ ఆనందాన్ని పంచుకున్నారు. తండ్రి మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో నటించిన కొమరం కోరిక మేరకు శ్రీకాంత్ ఓదేల తండ్రిని చంద్రశేఖర్‌ను స్టేజీ మీదకు ఆహ్వానించారు యాంకర్ సుమ. ‘దసరా’ (Dasara) సినిమా చాలా బాగుందని, ఈ విజయం సాధించేందుకు 12 ఏళ్ల పాటు తన కొడుకు కష్టపడ్డాడని భావోద్వేగానికి గురయ్యారు. మూవీ టీమ్ మొత్తానికి కంగ్రాచ్యులేషన్ చెప్పారు.

Also Read: Salman Khan Shirtless: వావ్.. వాట్ ఏ బాడీ, కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఫొటో వైరల్!