వరుస హిట్ల తో ఫుల్ స్వింగ్ లో ఉన్న నందమూరి బాలకృష్ణ..సంక్రాంతి బరిలో ‘డాకు మహారాజ్’ అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నందమూరి బాలకృష్ణ (Balakrishna) హీరోగా వాల్తేరు వీరయ్య (Waltair Veerayya) ఫేమ్ బాబీ(Boby) కలయికలో తెరకెక్కుతున్న ఈ మూవీ పై అంచనాలు తారాస్థాయి లో ఉన్నాయి. జనవరి 12న విడుదల కాబోతున్న ఈ మూవీలో ప్రగ్యా జైస్వాల్, ఊర్వశీ రౌతేలా, చాందినీ చౌదరి హీరోయిన్లు నటించారు. థమన్ మ్యూజిక్ అందిస్తుండగా, సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించారు. ప్రస్తుతం సినిమా రిలీజ్ దగ్గర పడుతుండడం తో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలపై దృష్టి సారించారు.
JC vs Madhavi Latha : జేసీ వ్యాఖ్యలపై మంత్రి సత్యకుమార్ ఆగ్రహం
ఈ క్రమంలో ఈనెల 5న డల్లాస్‌లో భారీ ఈవెంట్ జరపబోతున్నారు. ఈ ఈవెంట్ లో ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నారు. అమెరికా నందమూరి ఫ్యాన్స్ ఆధ్వర్యంలో జరగబోతున్న ఈ వేడుకలో యూనిట్ సభ్యులు పలువురు పాల్గొనబోతున్నారు. మొదటి సారి బాలకృష్ణ సినిమా ఈవెంట్ యూఎస్‌లో నిర్వహిస్తున్న నేపథ్యంలో ఫ్యాన్స్ పెద్ద ఎత్తున హాజరు కాబోతున్నారు. డల్లాస్ ఈవెంట్‌తో సినిమా ప్రమోషన్స్‌ను పూర్తి చేయకుండా తెలుగు రాష్ట్రాల్లోనూ రెండు ఈవెంట్స్‌కి సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ వారు ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్‌లో జనవరి 7వ తారీకున ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించబోతున్నారు. ఆ వెంటనే జనవరి 9వ తారీకున అనంతపూర్‌లో మరో ప్రీ రిలీజ్ వేడుకను అభిమానుల సమక్షంలో నిర్వహించబోతున్నారు. ఈ మేరకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక సంక్రాంతి బరిలో ఈ మూవీ తో పాటు గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం మూవీస్ రాబోతున్నాయి. మరి ఈ మూడు సినిమాల్లో ఏ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందో చూడాలి.