నిన్నటి నుండి సోషల్ మీడియా లో శ్రీదేవి ఆపళ్ళ (Sridevi Apalla) పెళ్లి వార్త తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ ఫోటో చూసి అంత నిజమే కావొచ్చని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. కానీ ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తేలిపోయింది. నాని నిర్మించిన ‘కోర్ట్’ సినిమాతో పాపులర్ అయిన శ్రీదేవి ఆపళ్ళ ఫోటోలో మెడలో దండ, పక్కన హ్యాండ్సమ్ యువకుడు ఉండటం చూసి ఇది పెళ్లి ఫోటో అని అనుకున్నారు చాలా మంది. కానీ అసలు విషయం ఏమిటంటే, ఆ ఫోటో ఆమె నటిస్తున్న కొత్త సినిమా ప్రారంభ వేడుకలో తీసినదే అని వెల్లడైంది. తమిళ సినిమా పరిశ్రమలో ఆనవాయితీగా పూజా కార్యక్రమాల్లో నటీనటుల మెడలో పూలదండలు వేసే సంప్రదాయం ఉంది. ఇప్పుడు కూడా అదే జరిగింది.
Coriander: వావ్.. కొత్తిమీర ఆకులతో ఇన్ని ప్రయోజనాలా!
‘గుర్తింపు’ అనే సినిమాలో శ్రీదేవి హీరోయిన్ గా నటిస్తుంది. తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతున్న ఈ స్పోర్ట్స్ కోర్ట్ డ్రామాలో కేజేఆర్ అనే నిర్మాత హీరోగా నటిస్తున్నారు. శివకార్తికేయన్ హీరోగా నటించిన ‘డాక్టర్’, ‘అయలాన్’ వంటి హిట్ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన కేజేఆర్, ఇప్పుడు కథానాయకుడిగా మారి ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు సోమవారం చెన్నైలో జరిగాయి. పూజా కార్యక్రమంలో తీసిన ఫోటో సోషల్ మీడియాలో పంచబడటంతో పెళ్లి అనిపించింది కానీ, నిజానికి ఇది కేవలం సినిమా ప్రారంభోత్సవ ఫోటో మాత్రమే.
Bharat Bandh Effect : ఈ రంగాలపై తీవ్ర ప్రభావం
‘గుర్తింపు’ సినిమాను ఇటీవల ‘మార్క్ ఆంటోనీ’ చిత్రాన్ని నిర్మించిన మినీ స్టూడియోస్ నిర్మిస్తోంది. ఇది వారి ప్రొడక్షన్ నం.15 సినిమా కాగా, తెలుగులో గంగా ఎంటర్టైన్మెంట్స్ విడుదల చేయనుంది. ఈ చిత్రానికి రెగన్ స్టానిస్లాస్ దర్శకత్వం వహించనున్నారు. ప్రధాన తారాగణంలో అర్జున్ అశోకన్, సింగం పులి, జయ ప్రకాష్, హరీష్ కుమార్, పృథ్వీ రాజ్ తదితరులు ఉన్నారు. సంగీతం జిబ్రాన్, సినిమాటోగ్రఫీ పి.వి. శంకర్ అందించనున్నారు. షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందని దర్శక నిర్మాతలు తెలిపారు.