Site icon HashtagU Telugu

Sam- Chaitu Divorce : సామ్ – చైతు విడిపోవడానికి చిరు సలహానే కారణమా..? ఏమన్నా ప్రచారమా..?

Sam Chaitu Div

Sam Chaitu Div

ఏమాయ చేసావే తో జోడి కట్టిన నాగ చైతన్య – సమంత (Naga Chaitanya and Samantha)లు నిజ జీవితంలో కూడా జోడి కట్టారు. మొదటి సినిమా తర్వాత ప్రేమలో పడిన వీరిద్దరూ కొన్నేళ్ల పాటు రహస్యంగా ప్రేమించుకున్నారు. ఆ తర్వాత పెళ్లి పీటలు ఎక్కారు. వీరి జంట చూసి ఎన్ని జంటలు కుల్లుకున్నాయో..ఎంతమంది ఈర్ష పడ్డారో తెలియంది కాదు..అక్కినేని వంటి పెద్ద ఫ్యామిలీ లో సమంత అడుగుపెట్టడం ఆమె అదృష్టమని అంత మాట్లాడుకున్నారు. పెళ్లి తర్వాత కొంతకాలం పాటు సజావుగా సాగిన వీరి కాపురంలో పలు గొడవలు జరిగి..చివరకు విడాకులు (Divorce ) తీసుకునే వరకు వచ్చింది. ఇద్దరు కూడా ఇష్టంగా విడాకులు తీసుకుంటున్నట్లు తెలిపి..ఎవరి పనుల్లో వారు బిజీ అయ్యారు. ఎందుకు విడాకులు తీసుకున్నారో చెప్పకపోయినప్పటికీ, అభిమానులు మాత్రం రకరకాలుగా మాట్లాడుకున్నారు. సమంత తప్పు వల్లే చైతు విడాకులు ఇచ్చాడని కొంతమంది..లేదు లేదు చైతు వల్లే అని మరికొంతమంది ఇలా ఎవరికీ వారు విడాకులపై మాట్లాడుకున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా వీరి విడాకులకు చిరంజీవి (CHiranjeevi కూడా ఓ కారణం అనే వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది. పెళ్లి తర్వాత రంగస్థలం సినిమాలో సమంత ను పెట్టుకుందామా లేదా అని సుకుమార్ టీం ఆలోచిస్తుందట. ఈ విషయాన్నీ చిరంజీవి వద్దకు తీసుకెళ్లగా…చిరు..ఆ పాత్ర నచ్చితే ఆమె ఓకే చెపుతుంది..లేదంటే లేదు. ఓసారి అడిగి చూస్తే తప్పేం కాదు కదా..అని అన్నారట. దీంతో వెంటనే సమంత ను కలిసి ఆమె పాత్ర ను వివరించగా..వెంటనే ఓకే చెప్పిందట. ఆతర్వాత సినిమా సూపర్ హిట్ కావడం , సామ్ కు మంచి పేరు రావడం తో..తనకు నటన ఫై మరింత ఆసక్తి పెరిగిందట. ఆ ఆసక్తే ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలా చేసింది. ఈ వెబ్ సిరీస్ తర్వాత సమంత, నాగ చైతన్యల మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత ఈ జంట విడాకులు తీసుకోవడం జరిగింది. దీంతో సమంత నాగచైతన్యల విడాకులకు పరోక్షంగా చిరు కూడా కారణం అయ్యారనే వాదన ప్రస్తుతం హల్చల్ చేస్తుంది.

Read Also : Rajamouli : బాబోయ్ 1000 కోట్ల బడ్జెట్ అంటే మాటలా జక్కన్నా..!