Chiranjeevi’s Daughter: చిరంజీవి కూతురు మూడో పెళ్లి చేసుకోబోతుందా?

మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల త్వరలో మూడో పెళ్లి చేసుకోబోతుందన్న రూమర్స్ జోరందుకున్నాయి. ఇంటర్నెట్, సోషల్ మీడియాలో

  • Written By:
  • Updated On - October 27, 2022 / 04:08 PM IST

మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల త్వరలో మూడో పెళ్లి చేసుకోబోతుందన్న రూమర్స్ జోరందుకున్నాయి. ఇంటర్నెట్, సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. నవంబర్‌లో శ్రీజ తన సన్నిహితుడితో వివాహం చేసుకోనుందని, కుటుంబ సభ్యులు దానిని గోప్యంగా ఉంచుతున్నారని తెలుస్తోంది. అయితే కొణిదెల ఫ్యామిలీ అధికారిక తెలియజేయాల్సి ఉంది. శ్రీజ కొణిదెల తన మొదటి మ్యారేజ్ 2007లో శిరీష్ భరద్వాజ్‌ తో జరిగింది. అయితే, కొన్ని సంవత్సరాల క్రితమే వీరిద్దరూ విడిపోయారు. 2011లో శిరీష్‌పై వేధింపుల కేసు పెట్టడంతో విడాకులు తీసుకోవాల్సి వచ్చింది.

శిరీష్ నుండి విడిపోయిన తర్వాత శ్రీజ ప్రముఖ వ్యాపారవేత్త కళ్యాణ్ దేవ్‌ను కలిశారు. ఈ జంట 2016లో బెంగళూరులో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. అయితే కొద్దికాలం తర్వాత ఈ ఇద్దరు వేర్వుగా ఉంటున్నారని సమాచారం. కాగా బ్రేకప్ వార్తలపై ఈ జంట ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ విడుకులు తీసుకోబోతున్నట్టు వార్తలు వినిపించాయి. అయితే శ్రీజకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆమె మొదటి వివాహం లో నివ్రతి, రెండవ వివాహంలో నావిష్క లకు జన్మనిచ్చింది.