Ram Charan Birthday Song : చ‌ర‌ణ్ బర్త్‌డే స్పెషల్.. ఆ పాట ఆపండి మహాప్రభో

Ram Charan Birthday Song  మెగా హీరో రామ్‌చరణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు భారీ సెలబ్రేషన్స్‌కు సిద్ధమవుతున్న వేళ మరో అంశం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. చరణ్ బర్త్‌డే కోసం అభిమానిగా గుర్తింపు పొందిన రవణం స్వామినాయుడు రూపొందిస్తున్న ప్రత్యేక సాంగ్ ప్రోమో విడుదల కాగా, అది తమకు నచ్చలేదని మెగా అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఈ ప్రోమోపై నెగటివ్ రియాక్షన్స్ రావడంతో “ఆ పాటను విడుదల చేయొద్దు” అంటూ స్వామినాయుడికి మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో […]

Published By: HashtagU Telugu Desk
Ram Charan

Ram Charan

Ram Charan Birthday Song  మెగా హీరో రామ్‌చరణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు భారీ సెలబ్రేషన్స్‌కు సిద్ధమవుతున్న వేళ మరో అంశం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. చరణ్ బర్త్‌డే కోసం అభిమానిగా గుర్తింపు పొందిన రవణం స్వామినాయుడు రూపొందిస్తున్న ప్రత్యేక సాంగ్ ప్రోమో విడుదల కాగా, అది తమకు నచ్చలేదని మెగా అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఈ ప్రోమోపై నెగటివ్ రియాక్షన్స్ రావడంతో “ఆ పాటను విడుదల చేయొద్దు” అంటూ స్వామినాయుడికి మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రిక్వెస్ట్ చేస్తున్నారు.

గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ పుట్టినరోజు (మార్చి 27) సమీపిస్తున్న కొద్దీ మెగా అభిమానుల్లో భారీ ఉత్సాహం కనిపిస్తోంది. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా చరణ్ బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయడానికి అభిమానులు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా ఆయన నటిస్తున్న సినిమాల నుంచి ఏదైనా స్పెషల్ అప్‌డేట్ వస్తుందా అనే ఆసక్తి అభిమానుల్లో ఎక్కువగా కనిపిస్తోంది. సోషల్ మీడియాలో కూడా ఇప్పటికే #RamCharanBirthday అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఈసారి చరణ్ పుట్టినరోజున ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ ఉండొచ్చని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో మెగా అభిమానులు ఆ రోజు కోసం మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే చరణ్ బర్త్‌డే సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఓ అంశం సోషల్ మీడియాలో తాజాగా చర్చకు దారి తీసింది. అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడిగా, ప్రముఖ మెగా అభిమానిగా పేరొందిన వరణం స్వామినాయుడు ఆధ్వర్యంలో ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా ఒక పాటను కంపోజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ పాటకు సంబంధించిన ప్రోమోను కూడా విడుదల చేశారు. కానీ ఆ ప్రోమో బయటకు రావడంతో అనూహ్యంగా మెగా అభిమానుల నుంచి మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చింది. చాలా మంది అభిమానులు ఈ ప్రోమో తమకు నచ్చలేదని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. “అభిమానంతో చేస్తున్న ప్రయత్నం బాగానే ఉన్నా.. ఈ పాటను విడుదల చేయకపోతే మంచిదని” కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు సోషల్ మీడియాలో కొందరు యాంటీ ఫ్యాన్స్ ఈ ప్రోమోను ట్రోల్ చేస్తున్నారు. దీంతో అసలు పాటను విడుదల చేయకుండా ఆపేయాలని కొంతమంది మెగా అభిమానులు స్వామినాయుడును నేరుగా అభ్యర్థిస్తున్నారు. “ప్రోమోకు వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ పాటను రిలీజ్ చేయకపోవడమే మంచిది” అంటూ పలువురు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశం నెట్టింట వైరల్‌గా మారింది. మరి మెగా అభిమానుల ఫీడ్‌బ్యాక్‌ని దృష్టిలో పెట్టుకుని స్వామినాయుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అన్న ఆసక్తి నెలకొంది. చరణ్ పుట్టినరోజున ఆయన సినిమాల నుంచి బిగ్ అప్‌డేట్లు వచ్చే అవకాశముందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘పెద్ది’ సినిమా నుంచి టీజర్ విడుదల కానున్నట్లు సమాచారం. అలాగే ఈ సినిమా తర్వాత సుకుమార్ – చరణ్ చేయబోయే కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రావచ్చని సినీ వర్గాలు చెబుతున్నాయి.

 

  Last Updated: 14 Mar 2026, 10:06 AM IST