Allu Arjun Vs Mega Fans : ‘చెప్పను బ్రదర్ ‘ కు 9 ఏళ్లు

Allu Arjun Vs Mega Fans : తెలుగు సినిమా పరిశ్రమలో ఒకప్పుడు దగ్గరగా ఉన్న మెగా మరియు అల్లు కుటుంబాల మధ్య ఏర్పడిన విభేదాలకు తెరలేపిన ఘట్టంగా నిలిచింది ‘చెప్పను బ్రదర్’ ఎపిసోడ్.

Published By: HashtagU Telugu Desk
Cheppanu Brother

Cheppanu Brother

‘చెప్పను బ్రదర్ ‘ (Cheppanu Brother) ఈ మాట మెగా అభిమానులు (Mega Fans) ఎప్పటికి మర్చిపోరు. ఈ మాట వైరల్ అయ్యి నేటికీ 9 ఏళ్లు గడుస్తుంది. తెలుగు సినిమా పరిశ్రమలో ఒకప్పుడు దగ్గరగా ఉన్న మెగా మరియు అల్లు కుటుంబాల మధ్య ఏర్పడిన విభేదాలకు తెరలేపిన ఘట్టంగా నిలిచింది ‘చెప్పను బ్రదర్’ ఎపిసోడ్. అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన సరైనోడు సినిమా విజయం (Sarrainodu) సాధించిన సందర్భంగా జరిగిన ఈవెంట్‌లో, అభిమానులు పవన్ కళ్యాణ్ పేరును ప్రస్తావించమంటూ నినాదాలు చేయగా, బన్నీ “చెప్పను బ్రదర్” అంటూ రియాక్ట్ కావడం పెద్ద సంచలనంగా మారింది. అప్పటి నుండి అల్లు ఫ్యాన్స్ – మెగా ఫ్యాన్స్ మధ్య తేడాలు మొదలయ్యాయి. ఇప్పుడు ఈ సంఘటనకు తొమ్మిదేళ్లు పూర్తవ్వడంతో, ఈ వ్యవహారం మళ్లీ చర్చనీయాంశంగా మారింది.

BRS Silver Jubilee : బీఆర్ఎస్ రజతోత్సవ సభ వేదిక ప్రత్యేకతలు మాములుగా లేవు

ఈ వ్యాఖ్యలపై ప్రతిస్పందనగా మెగా ఫ్యామిలీకి చెందిన సాయిధరమ్ తేజ్ ఇతర ఈవెంట్లలో “పవర్ స్టార్”, “మెగాస్టార్” అంటూ కౌంటర్ ఇచ్చాడు. ఇది రెండు ఫ్యామిలీల మధ్య దూరాన్ని మరింత పెంచింది. ముఖ్యంగా రాజకీయాలకు ముడిపడిన తరుణంలో ఈ తేడాలు మరింత ముదిరాయి. అల్లు అర్జున్ 2024 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి మద్దతుగా నంద్యాల వెళ్లడంతో, నాగబాబు సోషల్ మీడియాలో ఆయనపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో పాటు సాయిధరమ్ తేజ్ బన్నీని ట్విట్టర్‌లో అన్‌ఫాలో చేయడం, ఈ విభేదాన్ని మరింత వైరల్ గా మార్చింది.

Tanda Gangs : తెలుగు రాష్ట్రాల్లో టాండా దొంగలు.. ఎవరు ?

ఆ మధ్య మారుతీ నగర్ సుబ్రమణ్యం సినిమా ఈవెంట్‌లో అల్లు అర్జున్ “నాకిష్టమైతేనే వస్తా.. నా మనసుకు నచ్చితేనే వస్తా..” అనే వ్యాఖ్యలు చేయడం కూడా ఇండైరెక్ట్ గా మెగా ఫ్యామిలీకి సంబందించిన కామెంట్లుగా ప్రచారం అయ్యాయి. పవన్ కళ్యాణ్ గతంలో చేసిన “అప్పట్లో హీరోలు అడవులను కాపాడేవారు, ఇప్పుడు స్మగ్లింగ్ చేస్తున్నారు” అనే వ్యాఖ్యలకు బన్నీ ఇచ్చిన సమాధానంగా ఇది చూసారు. ఇలా ఒకరిపై ఒకరు మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. పుష్ప 2 రిలీజ్ సందర్బంగా జరిగిన తొక్కిసలాటలో అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడం పట్ల కూడా చాలామంది భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేసారు. ఇప్పుడిప్పుడే కాస్త మెగా – అల్లు వార్ తగ్గుతుండగా…ఇప్పుడు మరోసారి చెప్పను బ్రదర్ తెరపైకి వచ్చి పాత పగలను రెచ్చగొడుతుంది. మరి ఈ వార్ కు ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో..!!

  Last Updated: 22 Apr 2025, 03:01 PM IST