Nandamuri Tarakaratna: తారకరత్న మృతి పట్ల సీఎంలు, హీరోల సంతాపం

నందమూరి తారకరత్న (Nandamuri Tarakaratna) మరణంపై తెలుగు రాష్ట్రాల సీఎంలు జగన్‌, కేసీఆర్‌ సంతాపం తెలిపారు. ‘సినీ నటుడు, ఎన్టీఆర్‌ మనవడు నందమూరి తారకరత్న మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నా. తారకరత్న కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’ అని సీఎం జగన్‌, కేసీఆర్‌ తెలిపారు. మంత్రులు హరీశ్‌ రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, సత్యవతి రాథోడ్‌, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, వేముల ప్రశాంత్‌ రెడ్డి, టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి కూడా సంతాపం తెలిపారు. Also […]

Published By: HashtagU Telugu Desk
Tarakaratna

Tarakaratna

నందమూరి తారకరత్న (Nandamuri Tarakaratna) మరణంపై తెలుగు రాష్ట్రాల సీఎంలు జగన్‌, కేసీఆర్‌ సంతాపం తెలిపారు. ‘సినీ నటుడు, ఎన్టీఆర్‌ మనవడు నందమూరి తారకరత్న మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నా. తారకరత్న కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’ అని సీఎం జగన్‌, కేసీఆర్‌ తెలిపారు. మంత్రులు హరీశ్‌ రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, సత్యవతి రాథోడ్‌, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, వేముల ప్రశాంత్‌ రెడ్డి, టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి కూడా సంతాపం తెలిపారు.

Also Read: Taraka Ratna: నందమూరి తారకరత్న కన్నుమూత.. గుండెల్లో బ్లాక్స్ కారణం

టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయకుడు తారకరత్న మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. తారకరత్న మరణం పట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. చిన్న వయస్సులోనే మరణించడం పట్ల సంతాపం ప్రకటించారు. నందమూరి తారకరత్న ఆత్మకు శాంతి చేకూరాలని జనసేన చీఫ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోరుకున్నారు. ఆయన మరణం పట్ల ప్రకటన విడుదల చేశారు. తారకరత్న మరణవార్త తెలుసుకున్న సూపర్ స్టార్ మహేశ్ బాబు విచారం వ్యక్తం చేశారు. ‘నందమూరి తారకరత్న అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను అని పోస్ట్ చేశారు. టాలీవుడ్ సీనియర్ నటుడు రవితేజ కూడా తారకరత్న మరణవార్తపై భావోద్వేగంగా స్పందించారు.

  Last Updated: 19 Feb 2023, 07:16 AM IST