KGF2 700 cr club:తగ్గేదేలే అంటోన్న రాఖీ భాయ్..700కోట్ల క్లబ్ లో కేజీఎఫ్-2

KGF-2మరో మైలురాయిని అందుకుంది. తాజాగా 700 కోట్ల క్లబ్ లో చేరింది ఈ మూవీ.

  • Written By:
  • Publish Date - April 24, 2022 / 08:14 PM IST

KGF-2మరో మైలురాయిని అందుకుంది. తాజాగా 700 కోట్ల క్లబ్ లో చేరింది ఈ మూవీ. ప్రపంచవ్యాప్తంగా వారం రోజుల్లోనే 700 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి సంచలనం క్రియేట్ చేసింది. KGF-2 పదిరోజుల్లో 800 కోట్ల గ్రాస్ వసూలు చేసి సత్తా చాటింది. బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచి ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులను కన్నడ ఇండస్ట్రీకి వైపు తిరిగి చూసేలా చేసింది. కన్నడ బాహుబలిగా పేరు సంపాదించిన ఈ మూవీ ఒక టైటిల్ కంటే ఒక బ్రాండ్ గా మారింది. అటువంటి కల్ట్ మూవీకి సీక్వెల్ గా KGF-2ఈ మధ్యనే థియేటర్ లలో రిలీజ్ అయి అనుకున్న స్థాయి కంటే ఎక్కువ కలెక్షన్లు రాబడుతోంది.

కెజిఎఫ్ చాప్టర్ 1 రికార్డులను ఈ మూవీ తిరగరాస్తుందని ట్రేడ్ వర్గాలు ఎప్పటినుంచో విశ్లేషిస్తున్నాయి. అయితే లేటెస్టుగా ఈ మూవీ కలెక్షన్ల గురించి ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మూవీ రిలీజైన ఏడు రోజుల్లోనే 700కోట్ల క్లబ్ లో చేరి..ట్రేడ్ కు సైతం షాకిచ్చింది. ఫస్ట్ వీక్ లోనే భారీ కలెక్షన్లు అందుకున్న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా బాహుబలి-2 తర్వాత రెండవస్థానాన్ని దక్కించుకుంది. రెండో వారం రెండు రోజుల్లోనే 77కోట్లు వసూలు చేసింది. రంజాన్ సెలవులు కావడంతో దాదాపు వెయ్యి కోట్లు క్లబ్ లోకి చేరుతుందని అంచనా వేస్తున్నారు.

ఇక దీనిని ఒక కన్నడ మూవీగా కాకుండా తెలుగు సినిమాగానే ప్రేక్షకులు భావిస్తుండటంతో..కన్నడ స్థాయిలోనే తెలుగులోనూ ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతోంది. మరోపక్క యశ్ కు పాన్ ఇండియా క్రేజ్ రావడంతో ఆయనతో మూవీస్ చేసేందుకు బాలీవుడ్ బడా నిర్మాతలు క్యూ కడుతున్నారు. మరి యశ్ ఏ ప్రాజెక్టును ముందుగా లైన్ మీదకు తీసుకువస్తాడో చూడాలి.