Bimbisara : దూసుకుపోతున్న బింబిసార, సీతారామం…తొలిరెండు రోజుల్లో కలెక్షన్స్ ఎంతో తెలుసా..?

టాలీవుడ్ లో ఈ మధ్యే రిలీజ్ అయిన రెండు సినిమాలు హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. శుక్రవారం రిలీజ్ అయిన బింబిసార, సీతారామం సినిమాలు మంచి సక్సెస్ ను సాధించాయి. కల్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసార, మలయాళ యాక్టర్ దుల్కర్ సల్మాన్ నటించిన సీతారమం హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి.

  • Written By:
  • Publish Date - August 7, 2022 / 07:18 PM IST

టాలీవుడ్ లో ఈ మధ్యే రిలీజ్ అయిన రెండు సినిమాలు హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. శుక్రవారం రిలీజ్ అయిన బింబిసార, సీతారామం సినిమాలు మంచి సక్సెస్ ను సాధించాయి. కల్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసార, మలయాళ యాక్టర్ దుల్కర్ సల్మాన్ నటించిన సీతారమం హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. అంతేకాదు మంచి వసూళ్లను సైతం రాబట్టాయి.

బాక్సాఫీస్ దగ్గర బింబిసార తొలి రెండు రోజుల్లో రూ. 17కోట్లు వసూలు చేయగా…శుక్రవారం రూ. 9.25కోట్లు సాధించిన ఈ మూవీ శనివారం 7.75 కోట్ల కలెక్షన్స్ సాధించింది. తొలిరోజుతో పోల్చితే రెండో రోజు 17శాతం వసూళ్లు తగ్గాయి. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 20శాతం తగ్గుదల కనిపించింది. అయినా తొలివారంలో ఈ మూవీ రూ. 25కోట్ల వసూళ్లను సాధించే అవకాశం ఉంది. బింబిసార గ్లోబల్ థియేట్రికల్ హక్కులు రూ. 15కోట్లకు అమ్ముడుపోయాయి. ఈ మొత్తం కూడా మూడు రోజుల్లోనే రికవరీ అవుతుంది.

కాగా సీతారామం తొలిరెండు రోజుల్లో రూ. పదికోట్లు వసూళ్లు చేసింది. శుక్రవారం రూ. 3.80 కోట్లు సాధించిన ఈ సినిమా శనివారం మాత్రం రూ. 6.20కోట్లు రాబట్టింది. ఒక్కరోజులోనే కలెక్షన్లలో జంప్ దాదాపు 60శాతం పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగా సాధించింది. కేరళలో దాదాపు 80శాతం వృద్ధిరేటును సాధించింది. ఈ మూవీ వీక్ ఎండ్ లో రూ. 18కోట్లు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.