Bigg Boss 6: టాప్ లో రేవంత్..ఇనయా స్థానంలోకి ఆ కంటెస్టెంట్?

సాధారణంగా బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం చాలా కష్టం. ఇక బిగ్ బాస్ హౌస్ లో పరిస్థితులను

  • Written By:
  • Updated On - September 30, 2022 / 07:09 PM IST

సాధారణంగా బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం చాలా కష్టం. ఇక బిగ్ బాస్ హౌస్ లో పరిస్థితులను చూసే ప్రేక్షకులు అంచనా వేసినా కూడా అంచనాలను బిగ్ బాస్ షో నిర్వాహకులు తప్పు అని నిరూపిస్తూనే ఉంటారు. కాగా ముఖ్యంగా ఎలిమినేషన్స్, నామినేషన్స్ విషయంలో అయితే ఇప్పుడు అంచనాలు తప్పుతూనే ఉంటాయి. ప్రతి సీజన్ లాగే ఈసారి బిగ్ బాస్ సీజన్ లో పరిస్థితులు కూడా అదే విధంగా ఉన్నాయి. కంటెస్టెంట్లలో ఎవరు టాప్ లోకి వెళ్తున్నారో, ఎవరు బౌన్స్ బ్యాక్ అవుతున్నారు అన్నది అర్థం కావడం లేదు.

ఇక ప్రస్తుతం బిగ్ బాస్ నాలుగో వారంలో తాజాగా జరిగిన నామినేషన్ విషయానికి వస్తే.. ఎప్పటిలాగే ఈసారి కూడా రేవంత్ టాప్ లిస్టులో కొనసాగుతున్నాడు. కాగా గతవారం రేవంత్ కి ఓట్ల సంఖ్య తగ్గినప్పటికీ టాస్కులలో మరింత బలంగా పోరాడి మళ్లీ నెంబర్ వన్ ర్యాంకును సంపాదించుకున్నాడు. దీంతో రేవంత్ అందరికంటే ఎక్కువ ఓట్లు సంపాదించి మళ్లీ మొదటి స్థానానికి చేరుకున్నాడు. కాగా రేవంత్ తర్వాత రెండవ స్థానంలో శ్రీహాన్ ఉండగా అతడు లాస్ట్ జరిగిన టాస్కులు శ్రీహరి యాటిట్యూడ్ చూపించేసరికి అతనికి ఓట్లు తక్కువ పడ్డాయి.

దీంతో శ్రీహాన్ ప్లేస్ లోకి ఇనయా ఊహించిన విధంగా టాప్ 2 లో నిలిచింది. దీంతో శ్రీహన్ మూడవ స్థానంలో ఉన్నాడు. కాగా చివరి స్థానంలో కొనసాగిన ఇనయా ఎవరు ఊహించని విధంగా అత్యధిక ఓట్లు సాధించి బౌన్స్ బ్యాక్ అయింది. ప్రస్తుతం ఆమె నాలుగో స్థానంలో ఉంది. రెండవ స్థానంలో ఉన్న ఇనయా ప్లేస్ ను కీర్తి కబ్జా చేసింది. రేవంత్ తర్వాత ఊహించని విధంగా రెండవ స్థానంలో కీర్తి ఉండడం విశేషం. దీంతో ఇనయా నాలుగో స్థానంలోకి చేరుకుంది.