Bigg Boss Season 6: బాత్రూంకి వెళ్ళాలి అంటే 500 ఇవ్వాల్సిందే : సుదీప

బిగ్ బాస్ హౌస్ లో నాలుగవ వారం కంటటెస్టంట్ లకు బిగ్ బాస్ హోటల్ టాస్క్ ని ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ

  • Written By:
  • Updated On - September 28, 2022 / 11:10 PM IST

బిగ్ బాస్ హౌస్ లో నాలుగవ వారం కంటటెస్టంట్ లకు బిగ్ బాస్ హోటల్ టాస్క్ ని ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ టాస్క్ లో భాగంగానే కొందరు హోటల్లో పనిచేస్తున్న కంటెస్టెంట్లకు హోటల్ కి వచ్చే వారిని ఇంప్రెస్ చేయాలి అన్న ఒక టాస్క్ ని ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ టాస్క్ రసవత్తరంగా సాగుతుండగా ఇంతలోనే బిగ్ బాస్ హౌస్ లో వాష్ రూమ్ కి వెళ్ళాలి అంటే 500 ఇవ్వాలి అన్న లొల్లి మొదలైంది. తాజాగా బిగ్బాస్ సీజన్ సిక్స్ కి సంబంధించిన ప్రోమో వైరల్ అవుతోంది.

ఆ వీడియోలో సుదీప మాట్లాడుతూ వాష్ రూమ్ యూజ్ చేసుకోవాలి అంటే ప్రతి ఒక్కరు 500 రూపాయలు ఇవ్వాల్సిందే అంటూ అందరికీ షాక్ ఇచ్చింది. అప్పుడు వెంటనే ఆది రెడ్డి నేను వెళ్ళాలి అనుకుంటే 500 ఇచ్చి వెళ్తాను అని అంటాడు. అప్పుడు సూర్య నా డీల్ అయిపోయింది అని అంటాడు. ఆ తర్వాత సుదీప,పైమా దగ్గరికి వెళ్లి గ్రూపు ల గురించి చర్చించుకుంటూ ఉంటారు.. ఇక వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే రేవంత్ ఆమె లాజిక్కుకు ఈమె దగ్గర సమాధానం ఉండదు. అది తేలదు అంటూ వారిపై పంచులు వేశాడు.

అప్పుడు సుదీప్ ఆ పైమాతో మాట్లాడుతూ మీ వాళ్ళ నుంచి డీల్ గురించి ఎవరైనా చెప్పారు వెంటనే ఆపేయండి. లేదంటే మా సైడ్ నుంచి గొడవ అవుతుంది అని సుదీప అంటుంది. మరొకవైపు రాజశేఖర్ ఇచ్చిన డీల్ అయిపోయింది అని అంటాడు. అప్పుడు రేవంత్ ఇక నుంచి నువ్వు వాష్ రూమ్ వాడుకోవద్దు అంటూ రాజశేఖర్ కు గట్టిగా కౌంటర్ ఇస్తాడు. ఏ విషయం గురించే పై మా సుదీప్ ల మధ్య మళ్లీ గొడవ జరుగుతుంది.