Bigg Boss 6: టాప్ 5 కంటెస్టెంట్లకు గట్టి పోటీ ఇస్తున్న లేడీ కంటెస్టెంట్.. మరీ విజేతగా నిలుస్తుందా?

బిగ్ బాస్ హౌస్ హౌస్ లో ఎప్పుడు పరిస్థితులు ఏ విధంగా మారతాయో అంచనా వేయడం చాలా కష్టం. మరి ముఖ్యంగా

  • Written By:
  • Publish Date - November 3, 2022 / 02:51 PM IST

బిగ్ బాస్ హౌస్ హౌస్ లో ఎప్పుడు పరిస్థితులు ఏ విధంగా మారతాయో అంచనా వేయడం చాలా కష్టం. మరి ముఖ్యంగా ఎలిమినేషన్స్ విషయంలో అలాగే ఓటింగ్ విషయంలో అంచనాలు ఎప్పుడూ తప్పుతూ ఉంటాయి. ఇది ఇలా ఉంటే తెలుగులో ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 6 ప్రసారమవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే బిగ్ బాస్ షో ఐదు సీజన్ లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. కానీ ఇప్పటివరకు ప్రతి సీజన్ లో కూడా పురుషులే విన్నర్ లుగా నిలిచారు. కానీ ఆరో సీజన్ లో ఈసారి చివరి వరకు లేడీ కంటెస్టెంట్స్ కూడా మిగులుతారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే మొన్నటివరకు గీతూ రన్నరప్ గా నిలిచే అవకాశాలు ఉన్నట్టుగా కూడా వార్తలు వినిపించాయి. కానీ తాజాగా జరిగిన టాస్క్ తో ఒక్కసారిగా గీతూ ప్లేస్ లోకి ఇనయా వచ్చి చేరింది. హౌస్ లో ఉన్న వారిలో గీతూ కంటే ఎక్కువగా క్రేజ్ అందుకుంది ఇనయా. మొదట్లో ఈమె రెండు మూడువారా లోనే వెళ్ళిపోతుంది అనుకున్నప్పటికీ ఆ తర్వాత ఆమె తన గేమ్ తో మెల్లమెల్లగా టాప్ ఫైవ్ కంటెస్టెంట్ కి పోటీ ఇచ్చేవరకు కూడా చేరింది. టాస్క్ ల విషయంలో ఇనయా మాత్రం తగ్గకుండా గట్టిగానే పోటీ ఇస్తోంది. ఇకపోతే ఇప్పటివరకు ఐదు సీన్లలో అమ్మాయిలు గెలవలేదు.

ఒక సీజన్లో మాత్రమే గీతామాధురి ఫైనల్ వరకు వచ్చి సక్సెస్ కాలేకపోయింది. ఇక బిగ్ బాస్ ఓటిటిలో బిందు మాధవి గెలిచిన విషయం తెలిసిందే. కానీ అది ఓటీటీలు ఖాతాలోకి వెళ్లిపోతుంది. అయితే బిగ్ బాస్ సీజన్ 6 లో అబ్బాయిలకు బదులుగా అమ్మాయిలు గెలవాలి అని ఒక వర్గం ప్రేక్షకులు కోరుకుంటున్నారు. కదా ఇనయా ప్రస్తుతం టాప్ 2లో ఉండటమే కాకుండా గట్టి పోటీ ఇస్తోంది. ఇక ఇన్నయా కి శ్రీ సత్య కీర్తి వాసంతి పోటీగా ఉన్నప్పటికీ వాళ్ళు ఆమెకు అందుకోలేకపోతున్నారు. కాబట్టి మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 6 లో ఇనయా సుల్తానా ఫైనల్స్ వరకు వెళ్లి అబ్బాయిలకు పోటీ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.