Bigg Boss Season 6: ఈ వారం నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్ లు వీరే?

తెలుగులో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 చూస్తుండగానే అప్పుడే ఏడు వారాలను విజయవంతంగా పూర్తి

  • Written By:
  • Updated On - October 24, 2022 / 03:13 PM IST

తెలుగులో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 చూస్తుండగానే అప్పుడే ఏడు వారాలను విజయవంతంగా పూర్తి చేసుకుని ఎనిమిదో వారం లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక తాజాగా బిగ్ బాస్ హౌస్ నుంచి అర్జున్ కళ్యాణ్ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఎనిమిదవ వారం నామినేషన్స్ కు సంబంధించిన రచ్చ అప్పుడే మొదలైంది. ఈ నేపథ్యంలోనే తాజాగా 8 వ వారం నామినేషన్ కు సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు. కాగా ఇందులో గీతుకు రేవంత్ కి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది.

పెరుగు విషయంలో గీతూ కొట్లాటకు దిగాడు రేవంత్. అప్పుడు అది నా ఇష్టం నువ్వు ఎవరు అడగడానికి అంటూ ప్రశ్నిస్తాడు.ఆ తరువాత గీతూ హౌస్ మేట్స్ తో సేవ్ గేమ్ పక్కన పెట్టేయండి.. ఇక చాలు ఇప్పటికైనా స్టాండ్ తీసుకోండి అంటూ క్లాస్ పీకింది. ఈ నామినేషన్స్ ప్రక్రియలోనే ఇనయ,సూర్యకి మధ్య కూడా గొడవ జరిగింది. ఈ నేపథ్యంలోనే సూర్య నేను ఏడు వారాల తర్వాత సేఫ్ గేమ్ ఆడుతున్నాను అని నీకు ఎలా అనిపించింది అంటూ కోపంతో రగిలిపోయాడు సూర్య. అదే నీ సేఫ్ గేమ్ అంటూ సూర్య పై విరుచుకుపడింది ఇనయ.

అయితే ఇప్పటినుంచి మంచిగా ఉండకూడదు అన్నమాట అని అంటాడు సూర్య. తర్వాత ఆది రెడ్డి ఏ సమయంలో ఎవరితో ఉంటే బాగుంటుంది అన్నట్లుగా నువ్వు ప్రవర్తిస్తున్నావు అంటూ ఇనయ ను నామినేట్ చేశాడు. దానికి ఇనయ థాంక్స్ అని చెబుతుంది. మొత్తంగా చూసుకుంటే ఈ వారం మొత్తం ఇంట్లో ఉన్న కంటెస్టెంట్ లు అందరూ నామినేషన్ లో ఉన్నట్లు కనిపిస్తోంది. మరి ఈరోజు నామినేషన్ లో ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు అన్నది తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ వచ్చేవరకు ఆగాల్సిందే మరి.