Bigg Boss 6: వాసంతి కోసం త్యాగం చేసిన రోహిత్.. ఊహించని షాక్ ఇచ్చిన బిగ్ బాస్?

బిగ్ బాస్ సీజన్ 6 షో ఇప్పటికే ఐదు వారాలను విజయవంతంగా పూర్తి చేసుకుని ఆరో వారంలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం

  • Written By:
  • Updated On - October 14, 2022 / 10:06 AM IST

బిగ్ బాస్ సీజన్ 6 షో ఇప్పటికే ఐదు వారాలను విజయవంతంగా పూర్తి చేసుకుని ఆరో వారంలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఆరో వారంలో భాగంగా హౌస్ లోని సభ్యులకు బిగ్ బాస్ సర్ప్రైజ్ లతో ముంచెత్తుతున్నాడు. ఈ నేపథ్యంలోనే హౌస్ లోని వారికి బ్యాటరీ రీఛార్జ్ అనే టాస్క్ ను ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ టాస్క్ ద్వారా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లు వారి ఇంటి సభ్యుల నుంచి ఆడియో కాల్ వీడియో కాల్ లేదా ఫోటో ఫ్రేమ్ ఇలా వారికి నచ్చిన ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకునే అవకాశాన్ని కల్పించాడు బిగ్ బాస్.

కంటెస్టెంట్లకు సర్ ప్రైజ్ లు ఇస్తూనే వారి నుంచి కొన్ని త్యాగాలను ఆశిస్తున్నాడు. అలా బాలాదిత్యా సిగరెట్లు మానేయగా ఫైమా అతి కష్టం మీద ఇంగ్లీష్ సినిమా కథలను వివరించింది. అయితే ఇక మించి వాసంతి రోహిత్ లలో ఎవరైనా ఒక రెండు వారాలపాటు స్వతహాగా నామినేట్ కావాలి అని ఆదేశించాడు బిగ్ బాస్. అప్పుడు రోహిత్ తాను నామినేట్ అవ్వడానికి తాను సిద్ధం అని తెలిపాడు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఇక్కడ కంటెస్టెంట్ లు రోహిత్ వాసంతి లలో కంటెంట్ ఇవ్వని వారిని బయటికి పంపించేందుకు ప్రస్తావించినట్లు తెలుస్తోంది.

వారిద్దరూ సరిగ్గా గేమ్ ఆడటం లేదు ప్రేక్షకులను కూడా ఎంటర్టైన్ చేయడం లేదు. అందుకు తగ్గట్టుగా రోహిత్ కూడా సెల్ఫ్ నామినేట్ అవ్వడంతో వచ్చేవారం ఎలాగో రోహిత్ ఎలిమినేట్ అవ్వడం ఖాయం అని తెలుస్తోంది. మరొకవైపు ఆరో వారం హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారా అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే పలువురు కంటెస్టెంట్ల పేర్లు వినిపిస్తుండగా ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు.