Bigg Boss 6: కోపంతో కత్తితో పొడుచుకున్న సూర్య.. ఎమోషనల్ అయిన కీర్తి?

ప్రస్తుతం తెలుగులో ప్రసారవ్వుతున్న బిగ్ బాస్ సీజన్ 6 రసవత్తరంగా సాగుతోంది. ఇటీవల బిగ్ బాస్ హౌస్ లో చేపల

  • Written By:
  • Publish Date - October 28, 2022 / 06:50 PM IST

ప్రస్తుతం తెలుగులో ప్రసారవ్వుతున్న బిగ్ బాస్ సీజన్ 6 రసవత్తరంగా సాగుతోంది. ఇటీవల బిగ్ బాస్ హౌస్ లో చేపల చెరువు ముగిసిన విషయం తెలిసిందే. ఇందులో బాగానే ఆరుగురు కెప్టెన్సి కంటెడర్లుగా సెలెక్ట్ కాగా చివరికి కీర్తి, శ్రీహాన్, సూర్యలు మిగిలారు. కత్తిపోటు పొడిచి కెప్టెన్సీ నుంచి తప్పించుకునే అవకాశాన్ని ఇచ్చాడు బిగ్ బాస్. ఈ నేపథ్యంలో కీర్తి శ్రీహాన్ సూర్యలకు కత్తిపోట్లు పడ్డాయి. ఎవరికి అయితే కత్తిపోట్లు తక్కువగా ఉంటాయో వారు కెప్టెన్ అవుతారు అని బిగ్ బాస్ ఆదేశించాడు.

ఒక బిగ్ బాస్ చెప్పడంతో మెరీనా, పైమా, ఆదిరెడ్డి, వాసంతి, శ్రీ సత్య కత్తి దించేందుకు సిద్ధమయ్యారు. ఇక బిగ్ బాస్ చెప్పినట్టుగా సిద్ధమవుతూ ఒక్కొక్కరు ఒక్కొక్క కారణాలు చెబుతూ వారిని డిఫెన్స్ చేసుకున్నారు. ఇక కెప్టెన్సీ పోటీలు గా ఉన్న కీర్తి, సూర్య ఒకచోట సోఫాలో కూర్చుని ఎమోషనల్ గా మాట్లాడుతూ కనిపించారు. కెప్టెన్సీ పోటీ కోసం టాస్క్ పెట్టకుండా ఓటింగ్ ఎందుకు పెట్టారు అని కీర్తి అనగా వెంటనే సూర్య లాస్ట్ టైం కూడా నువ్వే ఇంటి సభ్యుల మద్దతుతో కెప్టెన్ అయ్యావు కదా అని అంటాడు.

తర్వాత కీర్తి ఏదో చెప్పబోతూ ఉండగా పైమా టీ తాగావా అని అంటాడు సూర్య. అప్పుడు కీర్తి నేను మాట్లాడుతున్న పట్టించుకోకుండా అక్కడ టీ గురించి అడుగుతున్నావు అంటూ ఎమోషనల్ అయింది. దాంతో ఏం మాట్లాడాలో ఏం చేయాలో తెలియక కోపంతో సూర్య తన మెడలో ఉన్న సి లెటర్ పై కత్తితో కసకస పొడుచున్నాడు. ఇకపోతే ఇప్పటికే సోషల్ మీడియాలో ఎనిమిదవ వారం హౌస్ లో నుంచి ఏ కంటెస్టెంట్ ఎలిమినేట్ కానున్నారు అన్న విషయంపై తీవ్ర స్థాయిలో చర్చలు నడుస్తున్నాయి.