Bigg Boss 6: నాగార్జునపై షాకింగ్ కామెంట్ చేసిన ఆది రెడ్డి.. ఏం జరిగిందంటే?

తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 ఇటీవలే మొదలై అప్పుడే చూస్తుండగానే 5 వారాలను విజయవంతంగా

  • Written By:
  • Updated On - October 15, 2022 / 09:55 AM IST

తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 ఇటీవలే మొదలై అప్పుడే చూస్తుండగానే 5 వారాలను విజయవంతంగా పూర్తి చేసుకొని ఆరో వారంలోకి ఎంతో ఇచ్చింది. ఇప్పటికే ఐదుగురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఇక ఇది ఇలా ఉంటే వారాలు గడిచే కొద్దీ బిగ్ బాస్ హౌస్ మరింత రసవత్తరంగా మారుతుంది. ఈ క్రమంలోనే ఆరవ వారంలో భాగంగా బ్యాటరీ రీఛార్జ్ అనే టాస్క్ ముగియడంతో తాజాగా ఆఖరి వరకు ఆగని పరుగు అనే టాస్క్ ను ఇచ్చాడు బిగ్ బాస్.

ఈ టాస్క్ లో భాగంగా ఆదిరెడ్డి, వాసంతి మధ్య పోటీ ఏర్పడింది. వీరిద్దరిలో ఒకరిని మిగతా ఇంటి సభ్యులు ఎన్నుకోవాల్సి ఉంటుంది. అలా ఎన్నికైన వారు నెక్స్ట్ లెవెల్ కి వెళతారు. ఇక ఆదిరెడ్డి, వాసంతి ఎందుకు కెప్టెన్ కావాలి అంటుకుంటున్నారో ఇంటి సభ్యులకు చెప్పాలి అని బిగ్ బాస్ ఆదేశించడంతో వెంటనే స్పందించిన ఆదిరెడ్డి మాట్లాడుతూ… నేను ఆల్రెడీ ఒకసారి కెప్టెన్ అయ్యాను.. అప్పుడు నాగార్జున సార్ నువ్వు ఏమీ పీకలేకపోయావ్ అన్నారు..

కాబట్టి ఇంకోసారి అవకాశం ఇస్తే పీకుదామని, అని చెప్పారు. దీంతో హౌస్ లోని కొందరు కంటెస్టెంట్లు ఆ మాటలకు షాక్ అయ్యారు. ఆదిరెడ్డి అలా చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన కామెంట్ కొంచెం బోల్డ్ గా ఉంది. ఇక హౌస్ కంటెస్టెంట్స్ లో కొందరు ఆదిరెడ్డికి మరికొందరు వాసంతికి ఓటు వేయడం జరిగింది. మరి వాసంతి ఆదిరెడ్డిలో ఎవరు నెక్స్ట్ లెవెల్ కి వెళ్తారు. ఎవరు ఓడిపోతారు అన్నది చూడాలి మరి. ఇది ఏమైనాప్పటికీ ఆదిరెడ్డి నాగార్జున అన్న మాటలు తిరిగి నాగార్జునకి రివర్స్ పంచ్ వేసినట్లు అర్థమవుతుంది. మరి ఒకవేళ ఆదిరెడ్డికి అవకాశం వస్తే మరి ఏం చేస్తారో తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ వచ్చేవరకు వేచి చూడాల్సిందే మరి.