Bigg Boss Season 6: బాలాదిత్య ఆట తీరుపై స్పందించిన మానస.. అదే తన వీక్ నెస్ అంటూ?

టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు నటుడు బాలాదిత్యా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి

  • Written By:
  • Updated On - October 15, 2022 / 11:04 PM IST

టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు నటుడు బాలాదిత్యా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బాలాదిత్యా నటుడుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకున్నాడు. ఇకపోతే ప్రస్తుతం బాలాదిత్య బిగ్బాస్ సీజన్ 6 లో కంటెస్టెంట్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే. బిగ్బాస్ హౌస్ లో సాఫ్ట్ అని స్వీట్ గా నడుచుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే అది బాలాదిత్య అని చెప్పవచ్చు. అయితే అతి మంచితనంతో బాలాదిత్యా బిగ్ బాస్ గేమ్ ఆడగా అది అతని శత్రువు గా మారింది.

ఈ విషయం పట్ల నెటిజన్స్ ఇది నిజంగా మంచితనమా లేకపోతే సేఫ్ గేమ్ ఆడుతున్నాడా? ఫేక్ కంటెస్టెంట్ అంటూ బాలాదిత్యా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ వారం బ్యాటరీ రీఛార్జ్ టాస్క్ లో భాగంగా బాలాదిత్య తన సిగరెట్లు త్యాగం చేసిన విషయం తెలిసిందే. అలా బాలాదిత్య తో మానిపించేలా చేసింది గీతూనే అని చెప్పవచ్చు. బిగ్బాస్ బాలాదిత్య తో సిగరెట్లు మానిపించాలి అని గీతుకు చెప్పడంతో గీతు అందరి ముందుర గట్టిగా అరిచి చెప్పింది. ఆ తర్వాత మానేస్తున్నాను అంటూ చెప్పిన బాలాదిత్య మళ్లీ బిగ్బాస్ కెమెరాల ముందుకు వచ్చి సిగరెట్లు పంపించమంటూ బ్రతిమలాడాడు.

ఇదే విషయంపై బాలాదిత్య భార్య మానస స్పందించింది. బాలాదిత్య సిగరెట్లు తాగడం మానేయాలి అనుకుంటే మానేయగలడు. హనుమాన్ మాల వేసినప్పుడు 40 రోజులు ఒక్క సిగరెట్ కూడా ముట్టుకోలేదు. అయితే గీతు అందరి ఎదుట సిగరెట్ మానేయాలని చెప్పడం అంత బాగోలేదు. అది తన వీక్నెస్ అని తెలిసి, అతనితో స్మోకింగ్ మానిపించాలి అన్నదే ఆమె ఉద్దేశం. కానీ దాన్ని నేను తప్పు పట్టను అని తెలిపింది మానస.