Bigg Boss: గలాటా గీతూ నా వల్ల ఎలిమినేట్ కాలేదు.. బాలాదిత్యా కామెంట్స్ వైరల్?

తెలుగు ప్రేక్షకులకు నటుడు బిగ్ బాస్ కంటెస్టెంట్ బాలాదిత్య గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం

  • Written By:
  • Updated On - November 14, 2022 / 04:01 PM IST

తెలుగు ప్రేక్షకులకు నటుడు బిగ్ బాస్ కంటెస్టెంట్ బాలాదిత్య గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం తెలుగులో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 లో కంటెస్టెంట్ గా పాల్గొన్న విషయం తెలిసిందే. తాజాగా పదవ వారం ఎలిమినేషన్స్ లో భాగంగా ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే బిగ్ బాస్ హౌస్ లో మంచివాడిగా, రేలంగి మామయ్య, అందరివాడు ఇలా అనేక రకాల పేర్లను తెచ్చుకున్నాడు బాలాదిత్య. అయితే కొంతమందికి అతని మంచితనం సోది లాగా కూడా అనిపించింది.

హౌస్ లో మిగతా హౌస్ మేట్స్ గురించి పక్కన పెడితే గీతూ మాత్రం బాలాదిత్య మాట్లాడుతుంటే మధ్యలోనే కట్ చేసి అతని నోరు మూయించేసేది. ఇన్ మెచ్యూర్ అంటూ పెద్ద మాట అనేసింది గీతూ. ఆ తర్వాత గీతూ తెలియక ఆ మాట అనింది అనుకొని లైట్ తీసుకున్నాడు. కానీ బిగ్ బాస్ హౌస్ లో సిగరెట్ల విషయంలో తన వీక్నెస్ మీద దెబ్బ కొట్టడానికి మాత్రం బాలాదిత్య తట్టుకోలేకపోయాడు. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక నువ్వు అసలు మనిషివేనా? ఆఫ్ట్రాల్ అంటూ వీతుపై ఒక రేంజ్ లో విరుచుకుపడ్డాడు. ఇది ఇలా ఉంటే తాజాగా బాలాదిత్య ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన తర్వాత బిగ్బాస్ కేఫ్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.

అప్పుడు యాంకర్ శివ ఇదే విషయం గురించి బాలాదిత్య ని ప్రశ్నించాడు.. ఈ సందర్భంగా శివ.. నేషనల్‌ టెలివిజన్‌లో ఒక అమ్మాయిని సిగ్గుందా? అనడం కరెక్టా? అని అడిగాడు. దీనికి అతడు ఆ మాట తప్పు కానీ నా బాధ తప్పు కాదని సమాధానమిచ్చాడు బాలాదిత్య. ఆఫ్టరాల్‌ ఒక్క సిగరెట్‌ అన్న నువ్వు అంత సీన్‌ చేయడం అవసరమా? మీ వల్లే గీతూ వెళ్లిపోయిందని శివ పేర్కొన్నాడు. ఆ మాటను అంగీకరించని బాలాదిత్య ఎవరు చేసిన పనికి వాళ్లే బాధ్యులు అని స్పష్టం చేశాడు. బాలాదిత్య మాటలను బట్టి చూస్తే గీతూ ఎలిమినేట్ అవ్వడానికి కారణం తాను కాదని చెప్పకనే చెప్పేసాడు .