Bigg Boss Season 6: అర్జున్ కి తొడ కొట్టి సవాల్ విసిరిన శ్రీహన్?

  • Written By:
  • Updated On - October 20, 2022 / 10:30 PM IST

తెలుగులో ఇటీవలే గ్రాండ్ గా మొదలైన బిగ్ బాస్ షో చూస్తుండగానే అప్పుడే ఆరు వారాలను విజయవంతంగా పూర్తి చేసుకుని ఏడవ వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ నుంచి ఆరుగురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. ఇది ఇలా ఉంటే బిగ్ బాస్ సీజన్ 6 లో ఎంటర్టైన్మెంట్ గత సీజన్లతో పోల్చుకుంటే అంతకుమించి అనే విధంగా ఉంటుంది అని ప్రేక్షకులు భావించారు. కానీ బిగ్ బాస్ సీజన్ 6తో పోల్చుకుంటే గత సీజన్ లు ఎన్నో రెట్లు మేలు అంటున్నారు బిగ్ బాస్ ప్రేమికులు.

అందుకు తాజాగా జరిగిన సంఘటన ఒక చక్కటి ఉదాహరణగా చెప్పవచ్చు. ఎప్పుడు లేనిది బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్లపై సీరియస్ అయ్యి ఇష్టం లేని వాళ్ళు బయటికి వెళ్లిపోవచ్చు అంటూ డోర్ తెరవడమే కాకుండా ఏకంగా కెప్టెన్సీ టాస్క్ ని రద్దు చేశాడు. దీంతో కంటెస్టెంట్లు అందరూ ఆస్తుల విషయంలో గేమ్లు విషయంలో సీరియస్ గా ఆడాలి అని నిర్ణయించుకున్నారు. ఇక ఇది ఇలా ఉంటే తాజా ఎపిసోడ్ లో కంటెస్టెంట్ శ్రీహాన్ బర్త్ డే ను సెలబ్రేట్ చేసుకోవడానికి ఇంటి సభ్యులు రెడీ అయ్యారు.

శ్రీహన్ బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం ఇనయ కూడా దగ్గరుండి పనులు చూసుకుంటుంది. దీంతో ఇదే విషయంపై హౌస్ లో ఇంటి సభ్యులు శ్రీ హన్ ను ఆటపట్టించారు. ఆ తర్వాత ఆహారం కోసం పోట్లాడిన హౌస్ మేట్స్ ఇంట్లో ఉండేందుకు కావలసినంత అర్హత కోసం ఫైట్ చేస్తూ ఉండగా పూల టాస్క్ అనే టాస్క్ ని ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టాస్క్ లో భాగంగా ఇంటి సభ్యులను విభజించినట్లు తెలుస్తోంది. ఈ టాస్క్ లో భాగంగానే అర్జున్,శ్రీహాన్ మధ్య గట్టిగానే గొడవ జరిగినట్లు కనిపిస్తోంది. శ్రీహన్ అర్జునుని ఎత్తి పడేసి, ఆ తర్వాత దమ్ముంటే అడ్డుకో అంటూ తొడ కొట్టి సవాల్ విసిరాడు శ్రీహాన్. మరి ఈ టాస్క్ లో అర్జున్ గెలుస్తాడా లేకపోతే శ్రీహాన్ గెలుస్తాడా అన్నది తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ వచ్చేవరకు వెయిట్ చూడాల్సిందే మరి.