Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ లో ఆర్జే సూర్య అంత సంపాదించాడా? బాబోయ్!

తెలుగులో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 షో లో తాజాగా ఎనిమిదో వారం ఎలిమినేషన్స్ ముగిసిన విషయం

  • Written By:
  • Updated On - October 31, 2022 / 03:28 PM IST

తెలుగులో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 షో లో తాజాగా ఎనిమిదో వారం ఎలిమినేషన్స్ ముగిసిన విషయం తెలిసిందే. 8వ వారం బిగ్ బాస్ హౌస్ లో ఊహించని ఎలిమినేషన్ జరిగింది అని చెప్పవచ్చు. తాజాగా బిగ్ బాస్ హౌస్ లో సాంగ్ కంటెస్టెంట్ అనిపించుకున్న ఆర్జే సూర్య ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో అతని అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. బిగ్ బాస్ ప్రేమికులు కూడా ఈ విషయం తెలిసి షాక్ అయ్యారు.

ఎలిమినేషన్స్ పై పలువురు నెటిజన్స్ స్పందిస్తూ స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా గుర్తింపు తెచ్చుకున్న సూర్య ఎలా ఎలిమినేట్ అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఆర్జే సూర్యకి సంబంధించి వార్త ఒకటి చెక్కర్లు కొడుతోంది. అదేమిటంటే బిగ్ బాస్ హౌస్ లో 8 వారాలకు గాను సూర్య ఎంత రెమ్యూనరేషన్ అందుకున్నాడు అన్న వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కాగా ఇదే విషయంపై అనేక రకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇక రెమ్యూనరేషన్ విషయానికి వస్తే..

బిగ్ బాస్ హౌస్ లో 8 వారాలకు గాను ఆర్జె సూర్య రూ.15.12 లక్షల పారితోషికం అందుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అనగా రోజుకు 27 వేల రూపాయలు చొప్పున వారానికి రూ. 1.89 లక్షలు అందుకున్నాడట. ఆ విధంగా 15 లక్షల వరకు అందుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే బిగ్ హౌస్ లో సూర్య కచ్చితంగా టాప్ ఫైవ్ కంటెస్టెంట్ లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంటాడు అని అందరూ భావించినప్పటికీ సూర్య చేసిన కొన్ని పనుల వల్ల ఇలా ఎలిమినేట్ అయి ఊహించిన విధంగా బయటకు రావాల్సి వచ్చింది.