Site icon HashtagU Telugu

Bigg Boss OTT 2 : బిగ్ బాస్ OTT 2.. వాళ్ల ముగ్గురు కన్ఫర్మ్ అయ్యారా..?

Bigg Boss Ott 2 Three Contestents Are Confirmed

Bigg Boss Ott 2 Three Contestents Are Confirmed

Bigg Boss OTT 2 బిగ్ బాస్ సీజన్ 7 ఈమధ్యనే పూర్తి కాగా త్వరలోనే బిగ్ బాస్ ఓటీటీ ని కూడా స్టార్ట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. 2024 మార్చి నుంచి బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2 మొదలవుతుందని తెలుస్తుంది. బిగ్ బాస్ ఓటీటీ నాన్ స్టాప్ సీజన్ 1 అంతకుముందు జరిగింది. ఆ సీజన్ కి కూడా నాగార్జుననే హోస్ట్ గా చేశారు. బింధు మాధవి ఆ సీజన్ విన్నర్ గా నిలిచారు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2 కి రంగం సిద్ధమైంది.

బిగ్ బాస్ ఓటీటీ లో మెయిన్ సీజన్ లో మంచి పర్ ఫార్మ్ చేసిన కొందరిని ఓటీటీలోకి తీసుకుంటారు. ఓటీటీ సీజన్ 2 లో కూడా సీజన్ 7 కి సంబంధించిన కొందరిని తీసుకుంటున్నారని తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 7 లో తమ టాలెంట్ చూపించిన భోలే శావలి, నయని పావని స్టార్ కంటెస్టెంట్ యావర్ ఈ ముగ్గురిని మళ్లీ ఓటీటీ సీజన్ లో రిపీట్ చేయాలని అనుకుంటున్నారట.

Also Read : Bigg Boss7 Shivaji : మెగా ఫ్యామిలీ గురించి శివాజీ ఆసక్తికర వ్యాఖ్యలు

బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2 లో ఈ ముగ్గురు దాదాపు ఉంటారని వార్తలు వస్తున్నాయి. మార్చి నుంచి ఓటీటీ సెకండ్ సీజన్ మొదలవుతుందని తెలుస్తుంది. ఓటీటీ సీజన్ 2ని కూడా నాగార్జున హోస్ట్ గా చేస్తారని తెలుస్తుంది. బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 70 రోజుల పాటు ఉంటుందని తెలుస్తుంది.

బిగ్ బాస్ సీజన్ 7 పూర్తి కావడంతో ఆ సెట్ అని అంతా మార్చేస్తున్నారు. మళ్లీ ఫిబ్రవరి లో కొత్త సెట్ వేసి మార్చి లో ఓటీటీ సెకండ్ సీజన్ స్టార్ట్ చేస్తారు. బిగ్ బాస్ సీజన్ 8 కి కూడా త్వరగానే మొదలవుతుందని తెలుస్తుంది.

We’re now on WhatsApp : Click to Join