Site icon HashtagU Telugu

Bigg Boss: బిగ్ బాస్ షోలోకి పోర్న్ స్టార్.. ఫ్యాన్స్ కు కిక్కే కిక్కు!

Hindi Bigboss

Hindi Bigboss

ప్రస్తుతం సినిమాలతో పాటు పాటు రియాల్టీ షోలు కూడా ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఎంటర్ టైన్ చేస్తున్నాయి. రియాల్టీ షో అనగానే చాలామంది బిగ్ బాస్ షో గుర్తుకురావడం కామన్ గా మారింది. ఈ షో బిగ్ బాస్ అన్ని భాషల్లో ప్రసారం అవుతోంది. ఒక్కో భాషకు ఒక్కొ స్టార్ హీరో వ్యాఖ్యతగా వ్యవహరిస్తూ షోను రక్తికట్టిస్తున్నారు. ఒక్క హిందీలోనే షో 15 సీజన్లు దాటింది. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా ఉన్నారు. గత సీజన్‌ల మాదిరిగానే సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ హిందీ 16వ సీజన్ కు హోస్ట్‌గా వ్యవహరించారు.

ఇప్పటికే రూ.250 కోట్లు సంపాదించిన సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ 16వ సీజన్ హోస్ట్ గా చేయడానికి రూ.1000 కోట్లు తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సీజన్ హిందీ బిగ్ బాస్ ఎన్నో ప్రత్యేకతలతో ప్రారంభమవుతుంది. బిగ్ బాస్ హిందీ ODT 2 కూడా ముంబై ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. కొత్త సీజన్ యొక్క కంటెస్టెంట్లు ప్రారంభ ఎపిసోడ్‌లో మాత్రమే అధికారికంగా ప్రకటించబడతారు. వారిలో అవినాష్ సచ్ దేవ్, ఆకాంక్ష పూరి, అలియా, బాబికా దుర్వే, పాలక్ నాస్, జియా శంకర్, మనీషా రాణి, పాలక్ పార్శ్వాని తదితరుల పేర్లు ప్రస్తావనకు వచ్చాయి.

అయితే మాజీ పోర్న్ స్టార్ మియా ఖలీఫా, శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాలను వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా సంప్రదించినట్లు సమాచారం. ఒకవేళ వీరిద్దరు బిగ్ బాస్ షోలో పాల్గొంటే ఈ షో ఓ రేంజ్ లో ఎంటర్ టైన్ చేయడం ఖాం. మాజీ పోర్న్ స్టార్ ఖలీఫాకు సోషల్ మీడియాలో ఫుల్ పాలోయింగ్ ఉంది. రెచ్చగొట్టే భంగిమలు, దుస్తులతో ఈ స్టార్ ఎంతోమందిని అభిమానులను సంపాదించుకుంది.

Also Read: Pushpa2 Video: లారీల ఛేజింగ్ సీన్స్.. పుష్ప2 వీడియో వైరల్!

Exit mobile version