Bigg Boss Season 6: నాలుగు వారాలకు గాను ఆరోహి ఎంత రెమ్యూనరేషన్ అందుకుందో తెలుసా?

తెలుగులో ప్రసారం అవ్వుతున్న బిగ్ బాస్ సీజన్ 6 చూస్తుండగానే అప్పుడే నాలుగు వారాలను విజయవంతంగా పూర్తి

  • Written By:
  • Publish Date - October 4, 2022 / 05:52 PM IST

తెలుగులో ప్రసారం అవ్వుతున్న బిగ్ బాస్ సీజన్ 6 చూస్తుండగానే అప్పుడే నాలుగు వారాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇప్పటికే హౌస్ నుంచి నలుగురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ కాగా ప్రస్తుతం హౌస్ లో 17 మంది కంటెస్టెంట్లు మాత్రమే మిగిలారు. ఇక తాజాగా నాలుగో వారం ఎలిమినేషన్ లో భాగంగా ఆరోహి రావు అనూహ్యంగా ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. చివర్లో సుదీప సేఫ్ అవ్వగా ఆరోహి ఎలిమెంట్ అయ్యి బయటకు వచ్చేసింది. ఆరోహి ఎలిమినేట్ కావడంతో ఆర్జే సూర్య ఫుల్ ఎమోషనల్ అయ్యారు.

ఆర్జె సూర్యతో పాటు కీర్తి కూడా ఫుల్ ఎమోషనల్ అయింది. ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఆరోహి నాలుగు వారాలకు గాను ఎంత రెమ్యూనరేషన్ అందుకుంది అన్న వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. ఆరోహి బిగ్ బాస్ హౌస్ లో నాలుగు వారాలపాటు కొనసాగిన విషయం తెలిసిందే. అయితే వారానికి 15,000 రూపాయలు చొప్పున బిగ్ బాస్ షో నిర్వహకులతో డీల్ కుదుర్చుకుందట ఆరోహి. చూసుకుంటే నాలుగు వారాలకు కలిపి గాను 60 వేల రూపాయలను పారితోషికంగా తీసుకున్నట్టు తెలుస్తోంది.

అయితే ఆరోహి ఊహించని విధంగా ఎలిమినేట్ అవడంతో అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. ఆమె వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇస్తే బాగుంటుంది అని అభిమానులు ఎంతగానో కోరుకుంటున్నారు. కొందరు మాత్రం నాలుగు వారాలకు గాను ఆమె అంత తక్కువ రెమ్యూనరేషన్ తీసుకుందా అని ఆశ్చర్యపోతున్నారు. ఇంకొందరు మాత్రం ఆర్జే సూర్య ఇప్పటినుంచి ఇండివిజువల్ గా గేమ్ ఆడతారా లేదంటే గ్రూప్ గా గేమ్ ఆడతాడా అన్న విధంగా కామెంట్స్ చేస్తున్నారు..