Bigg Boss 6: ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరంటే?

బిగ్ బాస్ షో గురించి మనందరికీ తెలిసిందే. తెలుగుతోపాటు ఇతర భాషల్లో కూడా ప్రసారమగుతున్న బిగ్ బాస్

  • Written By:
  • Publish Date - October 21, 2022 / 03:28 PM IST

బిగ్ బాస్ షో గురించి మనందరికీ తెలిసిందే. తెలుగుతోపాటు ఇతర భాషల్లో కూడా ప్రసారమగుతున్న బిగ్ బాస్ విపరీతంగా పాపులారిటీని సంపాదించుకుంది. ఇకపోతే ప్రస్తుతం బిగ్ బాస్ షో ఇప్పటికే ఐదు సీజన్ లను విజయవంతంగా పూర్తి చేసుకోగా ప్రస్తుతం ఆరవ సీజన్ నడుస్తోంది. ఇక ఇటీవలే గ్రాండ్ గా మొదలై బిగ్ బాస్ సీజన్ 6 చూస్తుండగానే ఆరువారాలను విజయవంతంగా పూర్తి చేసుకుని ఏడవ వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఏడవ వారం బిగ్ బాస్ కనిపిస్తేంట్లపై సీరియస్ అవ్వడంతో కంటెస్టెంట్లు కాసా సీరియస్ గా గేమ్ లు ఆడుతున్నారు.

బిగ్ బాస్ సీరియస్ అవ్వడంతో ఓటింగ్ విషయంలో కూడా చాలా వరకు మార్పులు వచ్చినట్టు తెలుస్తోంది. మొదటి రెండు స్థానాల్లో ఎప్పటిలాగే ఎటువంటి మార్పులు రాలేదని తెలుస్తోంది. ఎక్కువ ఓట్లతో రేవంత్ టాప్ ప్లేస్ లో ఉండగా, ఆ తర్వాత రెండవ స్థానంలో శ్రీహన్ కొనసాగుతున్నాడు. ఇక ఆ తర్వాత స్థానాలలో ఉండే కంటెస్టెంట్లు ఓటింగ్ విషయంలో కాస్త మార్పులు జరిగినట్లుగా తెలుస్తోంది. ఏడో వారం ఓటింగ్‌లో గురువారం ఎపిసోడ్ తర్వాత ఓటింగ్ లలో కొన్ని మార్పులు జరిగాయి.

ఆ మార్పులలో భాగంగానే మూడో స్థానంలో బాలాదిత్య, నాలుగో స్థానంలో జబర్ధస్త్ ఫైమా, ఐదో స్థానంలో ఆది రెడ్డి, ఆరో స్థానంలో కీర్తి భట్, ఏడో స్థానంలో రోహిత్, ఎనిమిదో స్థానంలో అర్జున్ కల్యాణ్, తొమ్మిదో స్థానంలో ఇనాయా, పదో స్థానంలో వాసంతి ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఆ తర్వాత స్థానాలలో శ్రీ సత్య, మెరీనా లు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఏడవ వరం శ్రీ సత్య మెరీనాలలో ఒకరు తప్పకుండా ఎలిమినేట్ అవుతారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.