Bigg Boss 6: ఆదిరెడ్డి చేసిన పనికి కంట్రోల్ తప్పిన రోహిత్..బ్యాగ్ ని కాలితో తంతు ఫైర్?

తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 రసవత్తరంగా సాగుతోంది. కాగా పదో వారం కెప్టెన్సీ టాస్కులలో భాగంగా

  • Written By:
  • Publish Date - November 10, 2022 / 02:45 PM IST

తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 రసవత్తరంగా సాగుతోంది. కాగా పదో వారం కెప్టెన్సీ టాస్కులలో భాగంగా కంటెస్టెంట్లు పోటీ పడి రెచ్చిపోయి మరి ఆడుతున్నారు. కాగా కెప్టెన్సీ టాస్కులతో భాగంగా వాతావరణం వేడివేడిగా సాగుతోంది. ఇకపోతే తాజాగా హౌస్ లో నాగమణి టాస్క్ లో విజయం సాధించిన పాముల టీం అయిన ఆదిరెడ్డి,రోహిత్, కీర్తి, శ్రీ సత్య,మేరీనా కూడా కెప్టెన్సీ పోటీలో నిలిచారు. వీరికి బిగ్ బాస్ వస్తా నీ వెనుక అనే టాస్క్ ని ఇచ్చారు.

కాగా ఈ టాస్క్ లో భాగంగా ధర్మకోల్ నిండిన బ్యాగులను ఇతర కంటెస్టెంట్లు చింపకుండా కాపాడుకోవాల్సి ఉంటుంది. కథ ఈ టాస్క్ లో ఆదిరెడ్డి రోహిత్,మెరినా లను టార్గెట్ చేశాడు. ఇక అందరికంటే ముందు మెరీనా ఈ టాస్క్ నుంచి తప్పుకుంది. ఆదిరెడ్డి రోహిత్ పైకి అటాక్ వెళ్లగా ఆదిరెడ్డికి సపోర్ట్ గా ఫైమా కూడా తోడైంది. అప్పుడు మొదట బ్యాగులను రక్షించుకోవచ్చు అని చెప్పిన బిగ్ బాస్ బ్యాగ్ టచ్ చేయకూడదు అని చెప్పడంతో ఆ తర్వాత మళ్లీ గేమ్ ని మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే సంచాలక్ పై మండిపడ్డాడు.

బ్యాగు పట్టుకోకూడదు అని బిగ్ బాస్ చెప్పారు. అలాంటిది రోహిత్ బ్యాగ్ పట్టుకుంటున్నాడు అని అరిచినా కూడా సంచాలక్ వినిపించుకోలేదు అని గట్టిగా అరిచాడు రోహిత్. అప్పుడు ఫైమా, ఆదిరెడ్డి ఇద్దరు రోహిత్ బ్యాగ్ ని చింపేసి అతని బ్యాగులో ఉన్న ధర్మకోల్ ని మొత్తం కింద పడేయడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రోహిత్ కాలితో బ్యాగ్ ని తన్నుతో నేను బ్యాగులు పట్టుకోలేదు అని అరుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడు మెరీనా రోహిత్ ని కూల్ కూల్ జనాలు చూస్తున్నారు అని సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ, రోహిత్ కోపం మాత్రం చల్లారలేదు. దాంతో రోహిత్ తన బ్యాగు ని తీసి నేలకేసుకు విసిరికొట్టి అక్కడ నుంచి వెళ్లిపోవడంతో రోహిత్ కోపం చూసిన మిగతా కంటెస్టెంట్లు ఆశ్చర్యపోయారు.