Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ లో భారీ ట్విస్ట్.. ఎలిమినేట్ అయిన గీతూ?

బిగ్ బాస్ హౌస్ లో పరిస్థితులు ఎప్పుడు ఏ విధంగా మారతాయో అంచనా వేయడం చాలా కష్టం. చాలా వరకు బిగ్ బాస్

  • Written By:
  • Publish Date - November 5, 2022 / 06:30 PM IST

బిగ్ బాస్ హౌస్ లో పరిస్థితులు ఎప్పుడు ఏ విధంగా మారతాయో అంచనా వేయడం చాలా కష్టం. చాలా వరకు బిగ్ బాస్ హౌస్ లో ప్రేక్షకుల అంచనాలు ఎలిమినేషన్స్ విషయంలో తప్పు అని నిరూపిస్తూ ఉంటాడు బిగ్ బాస్. హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ని ఎలిమినేట్ చేస్తూ హౌస్ మేట్స్ కి అలాగే ప్రేక్షకులకు కూడా ఊహించని షాక్ ఇస్తూ ఉంటాడు. హౌస్ లో పర్లేదు ఈ కంటెస్టెంట్ బాగానే ఆడుతున్నాడు అనుకుంటున్న క్రమంలోనే ఆ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్లి పోయినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు.

అందుకు ఉదాహరణ ఆర్జె సూర్య. ఎవరు ఊహించని విధంగా ఆర్జే సూర్య ఎలిమినేట్ బయటకు వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఇకపోతే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ గీతూ విషయానికి వస్తే హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడంతోనే పక్కా ప్లానింగ్ తో ఎంట్రీ ఇచ్చిన గీతూ 9 వారాలు అయినా కూడా అలాగే ఆడుతూ వస్తోంది. అంతే కాకుండా ప్రతి ఒక ఎపిసోడ్లో గీతూ హైలెట్ గా నిలుస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే గతవారం నాగార్జున గీతూ కి ఫుల్ గా క్లాస్ పీకిన విషయం తెలిసిందే.

ఇక ఇది ఇలా ఉంటే ఇక తొమ్మిదవ వారం నామినేషన్స్ లో భాగంగా మొత్తం పదిమంది ఉండగా అందులో చివరగా ఫైమా మెరీనా గీతూ లు డేంజర్ జోన్ లో తక్కువ ఓటింగ్ తో ఉన్నారు. మరి ముఖ్యంగా పదవ స్థానంలో గీతూ డేంజర్ జోన్ లో ఉంది. ఇది ఇలా ఉంటే తాజాగా అందిన సమాచారం ప్రకారం గతవారం ఆర్జె సూర్య ని బయటకు పంపించిన బిగ్ బాస్ ఈసారి ఏకంగా గీతూకే టెండర్ పెట్టినట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఈ తొమ్మిదవ వారం ఎలిమినేషన్స్ లో భాగంగా బిగ్ బాస్ హౌస్ నుంచి గీతూ ఎలిమినేట్ అయింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఓటింగ్ కి సంబంధించిన ఒక ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి నిజంగానే తొమ్మిదవ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి గీతూ ఎలిమినేట్ అయ్యిందా లేదా తెలియాలి అంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే మరి.