Bigg Boss 6 Telugu: నాలుగు వారం ఎలిమినేషన్స్ లో పదిమంది.. ఎవరెవరు నామినేట్ అయ్యారో తెలుసా?

తెలుగులో ఇటీవలే మొదలైన బిగ్ బాస్ సీజన్ సిక్స్ చూస్తుండగానే అప్పుడే మూడు వారాలను విజయవంతంగా పూర్తి

  • Written By:
  • Updated On - September 26, 2022 / 10:55 PM IST

తెలుగులో ఇటీవలే మొదలైన బిగ్ బాస్ సీజన్ సిక్స్ చూస్తుండగానే అప్పుడే మూడు వారాలను విజయవంతంగా పూర్తి చేసుకుని నాలుగో వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. కాగా ఇప్పటికే హౌస్ నుంచి ముగ్గురు కంటెంట్ ఎలిమినేట్ కాగా ప్రస్తుతం హౌస్ లో 18 మంది కంటెస్టెంట్లు మాత్రమే మిగిలారు. మొదటి వారం ఎలిమినేషన్ లేదు అంటూ రెండవ వారం అభినయ శ్రీ, షాని సల్మాన్ ని ఎలిమినేట్ చేసి షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక తాజాగా మూడవ వారం ఎలిమినేషన్స్ లో భాగంగానే నేహా చౌదరిని ఎలిమినేట్ చేశారు.

ఇది ఇలా ఉంటే తాజాగా నాలుగో వారం ఏ నామినేషన్స్ కు సంబంధించి ఒక ప్రోమో విడుదల అయింది. ఇక ఆ ప్రోమోలో హౌస్ లోని కంటెస్టెంట్లకు ఒక టాస్క్ ని ఇచ్చాడు. ఆ టాస్క్ లో భాగంగా ఒక్కొక్క కంటెస్టెంట్ వారికి నచ్చని ఇద్దరి తలలపై టమోటా రసం పిండి ఎందుకు నామినేట్ చేస్తున్నారు అన్న విషయాన్ని చెప్పాల్సిందిగా టాస్క్ ను ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టాస్క్ లో భాగంగా శ్రీహాన్,ఇనయా గతవారం జరిగిన గొడవలు ని మరొకసారి గుర్తుతెచ్చుకుంటూ ఒకరినొకరు నామినేట్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఇనయా నామినేట్ చేసే ముందు రెండు ప్రశ్నలు అడుగుతాను చెప్తావా అని అడగగా అప్పుడు శ్రీహాన్ తన యాటిట్యూడ్ చూపిస్తు నచ్చితే సమాధానం ఇస్తాను లేకపోతే లేదు అంటాడు.

ఆ తర్వాత హౌస్ లోని కంటెస్టెంట్లు వారికి నచ్చని కంటెస్టెంట్ల తలపై టమోటా రసం పిండి వారిని నామినేట్ చేయడానికి గల కారణాలు చెప్పారు. ఈ క్రమంలోనే ఇనయా, శ్రీ హాన్ ల మధ్య ఏజ్ గ్యాప్ విషయంలో మళ్ళీ గొడవ జరిగింది. ఇది ఇలా ఉంటే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ వారం పది మంది ఎలిమినేషన్ కోసం నామినేట్ అయ్యారు. ఆ పది మందిలో సుదీప, కీర్తి, గీతూ, రేవంత్, రాజశేఖర్, ఇనయా సుల్తానా, అర్జున్ కళ్యాణ్, సూర్య, ఆరోహి నామినేట్ అయినట్లు తెలుస్తోంది. అయితే మిగతా ఎనిమిది మంది సభ్యులు నామినేషన్స్ లోకి రాలేదు. మరి ఈ వారం హౌస్ మేట్స్ లో ఎవరికి ప్రేక్షకులు అత్యధికంగా ఓట్లు వేసి వారిని సేవ చేస్తారో, తక్కువ ఓట్లు వేసి ఎవరిని బయటికి పంపిస్తారో చూడాలి మరి.