Bharateeyudu 2 : భారతీయుడు 2 వచ్చేశాడు.. ఇంట్రో టీజర్ తోనే అదరగొట్టేశారు..!

Bharateeyudu 2 దాదాపు ఇరవై ఏళ్ల క్రితం వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా ఇండియన్ 2 సినిమా వస్తున్న విషయం తెలిసిందే. శంకర్, కమల్

Published By: HashtagU Telugu Desk
Bharateeyudu 2 Intro Teaser Released Kamal Hassan Shankar

Bharateeyudu 2 Intro Teaser Released Kamal Hassan Shankar

Bharateeyudu 2 దాదాపు ఇరవై ఏళ్ల క్రితం వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా ఇండియన్ 2 సినిమా వస్తున్న విషయం తెలిసిందే. శంకర్, కమల్ (Kamal Hassan) ఇద్దరు కలిసి మరోసారి భారతీయుడు సత్తా ఏంటో చూపాలని ఫిక్స్ అయ్యారు. అయితే అవినీతి కరెప్షన్ నేపథ్యంతో వచ్చిన ఈ సినిమా అప్పట్లో సెన్సేషనల్ హిట్ కాగా ఇప్పుడు అది మరింత తీవ్ర తరం అయిన సందర్భంగా అదే నేపథ్యంతో సరికొత్త కథాంశంతో భారతీయుడు 2 సినిమా తీస్తున్నారు.

ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రో టీజర్ లేటెస్ట్ గా రిలీజ్ చేశారు మేకర్స్. భారతీయుడు (Bharateeyudu) మళ్లీ వచ్చాడు అంటూ వచ్చిన ఈ ఇంట్రో టీజర్ అదిరిపోయింది. ఎప్పుడు తప్పు జరిగితే అప్పుడు భారెతీయుడు వస్తాడు అంటూ ఓల్డ్ కమల్ హాసన్ పాత్రని పరిచయం చేశారు. సినిమా ఇంట్రొ టీజర్ లోనే దాదాపు సినిమా ఎంత డెప్త్ గా ఉంటుందో చూపించారు.

Also Read : Lavanya Tripathi : నీ పెళ్లికి చిరంజీవి వస్తాడా.. లావణ్య సినిమాలో డైలాగ్ ఇలా నిజమైంది..!

భారతీయుడు 2 కచ్చితంగా ప్రేక్షకులకు ఒక మంచి సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వబోతుందని చెప్పొచ్చు. కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటితున్న భారతీయుడు 2 సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh), సిద్ధార్థ్ (Siddharth) కూడా నటిస్తున్నారు. సినిమా రిలీజ్ ఎప్పుడన్నది ఇంకా క్లారిటీ రాలేదు కానీ సినిమా ఎప్పుడు వచ్చినా ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేయడం పక్కా అని చెప్పొచ్చు.

We’re now on WhatsApp : Click to Join

  Last Updated: 03 Nov 2023, 06:47 PM IST