ఒకప్పుడు సినిమా సక్సెస్ అయితేనే సక్సెస్ మీట్ (Movie Success Meet), సక్సెస్ సంబరాలు జరిపేవారు. కానీ ఇప్పుడు సినిమా మొదటి రోజు మొదటి షో తోనే ప్లాప్ టాక్ తెచ్చుకున్న సరే ఆ వెంటనే సక్సెస్ మీట్ ఏర్పాటు చేయడం , స్వీట్స్ పంచుకోవడం , సక్సెస్ సంబరాలు జరపడం చేస్తున్నారు. ఇది ఏంటి అంటే జనాలు రావడం కోసం ప్రమోషన్ అంటున్నారు. అయితే ఇప్పుడు భైరవం (Bhairavam ) టీం ఓ అడుగు ముందుకేసి ఇంకా రిలీజ్ కు రెండు రోజులు ఉండగానే సక్సెస్ సంబరాలు జరుపుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు.
Mahanadu : పరీక్షల్ని ఎదుర్కొన్న ప్రతిసారీ విజయం సాధించాం – చంద్రబాబు
తెలుగు సినీ పరిశ్రమలో కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ‘భైరవం’ మే 30న విడుదల కాబోతోంది. ఈ సినిమాలో మంచు మనోజ్, నారా రోహిత్ కూడా కీలక పాత్రల్లో నటించారు. తమిళ హిట్ మూవీ ‘గరుడన్’కు ఇది రీమేక్‌గా రూపొందించబడింది. ట్రైలర్ విడుదల తర్వాత సినిమా మీద ఆసక్తి పెరిగింది. గుడి నేపథ్యంలో ముగ్గురు మిత్రుల చుట్టూ సాగే యాక్షన్ డ్రామాగా కనిపిస్తున్న ఈ చిత్రానికి విజయ్ కనకమేడల దర్శకత్వం వహించారు. తెలుగు నేటివిటీకి తగిన మార్పులు చేసి సినిమాను మలిచారు.
PM Modi : అప్పుడు సర్దార్ పటేల్ మాట విని ఉంటే 76 ఏళ్లుగా ఉగ్రదాడులు ఉండేవి కాదు : ప్రధాని మోడీ
ఇదిలా ఉండగా, సినిమా విడుదలకు ఇంకా మూడ్రోజుల సమయం ఉన్నప్పటికీ బెల్లంకొండ శ్రీనివాస్ ప్రీ-రిలీజ్ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. బాణాసంచా కాలుస్తూ, కేక్ కట్ చేస్తూ బైరవం బ్లాక్‌బస్టర్ అంటూ నినాదాలు చేసిన వీడియో చూసి నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. రిలీజ్ కాకముందే ఇటువంటి సంబరాలు జరపడం ఓవర్‌గా ఉందని, సినిమా ఫలితాన్ని ముందుగానే నిర్ణయించడమేమిటని కామెంట్లు చేస్తున్నారు. ఈ ప్రీ రిలీజ్ పార్టీ బైరవాన్ని హాట్ టాపిక్‌గా మార్చినా, నెగిటివ్ టాక్ కూడా తెచ్చుకుంది.
బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్‌లకు పరిశ్రమలో పదేళ్లకుపైగా అనుభవం ఉన్నా, వారికి స్థిరమైన మార్కెట్ లేదన్న సంగతి తెలిసిందే. కానీ ముగ్గురు హీరోల కలయికతో మూవీపై మంచి హైప్ వచ్చింది. ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ సినిమాకు రూ.50 కోట్లు బడ్జెట్ పెట్టారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇది వీరి మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుంటే భారీ మొత్తం. వీళ్ల త్రయం కలసి ఈ బడ్జెట్‌ను రికవరీ చేయగలరా లేదా అన్నది ఆసక్తికర అంశంగా మారింది. చూద్దాం ఏంజరుగుతుందో !!