Rashmika and Bellamkonda: రష్మిక తో డేటింగ్.. బెల్లంకొండ రియాక్షన్ ఇదే!

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, రష్మిక మందన్న డేటింగ్ ఉన్నట్లు వార్తలు హల్ చల్ చేశాయి.

  • Written By:
  • Updated On - May 3, 2023 / 12:49 PM IST

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda), రష్మిక మందన్న ఇటీవల ఎయిర్ పోర్ట్ లో జంటగా కనిపించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. నేషనల్ క్రష్  బెల్లకొండతో డేటింగ్ (Dating) చేస్తున్నట్లు రూమర్స్ హల్ చల్ చేశాయి. వారిద్దరు కలిసి ఉన్న ఫొటోలు కూడా విపరీతంగా వైరల్ కావడంతో డేటింగ్ లో ఉన్నారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ సైతం రష్మిక పై రియాక్ట్ అయ్యారు.

ప్రస్తుతం తన హిందీ తొలి చిత్రం చత్రపతి ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న బెల్లంకొండ రష్మిక మందన్న (Rashmika) తో డేటింగ్ పుకార్లపై తొలిసారిగా స్పందించాడు. “ఇది ఎలా వచ్చిందో నాకు తెలియదు, ఇది పూర్తిగా అబద్ధం. ఎందుకంటే మేం కేవలం మంచి స్నేహితులు మాత్రమే. నిజానికి ఎయిర్ పోర్ట్ లోనే కలుసుకున్నాం. తరచుగా మేం ఇద్దరం ముంబై వస్తుంటాం, పోతుంటాం. అలా అనుకోకుండా కలిసి ప్రయాణం చేయాల్సి వచ్చింది. అంతేకానీ డేటింగ్ వార్తల్లో నిజం లేదు. రష్మిక పవర్ ఫుల్ ఉమెన్ అని ఈ సందర్భంగా బెల్లకొండ అన్నాడు. ఆమె వ్యక్తిత్వం చాలా మంచిది అని చెబుతూ..  ’’ఎల్లప్పుడూ ఆ ఎనర్జిటిక్‌గా ఉండండి. అనవసర విషయాలను పట్టించుకొని నీలోని శక్తిని వేస్ట్ చేయొద్దు’’ అంటూ రష్మికను ఉద్దేశించి రియాక్ట్ అయ్యాడు.

కాగా మంగళవారం హిందీ ఛత్రపతి ట్రైలర్ విడుదలైంది. యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది. ప్రభాస్, SS రాజమౌళిల బ్లాక్ బస్టర్ తెలుగు చిత్రానికి రీమేక్. బాలీవుడ్ (Bollywood)ను ద్రుష్టిలో పెట్టుకొని కథలు మార్పులు చేసి డైరెక్ట్ చేశారు. హిందీ రీమేక్‌ ను వివి వినాయక్‌ డైరెక్ట్ చేయగా, నుష్రత్ భరుచ్చా హీరోయిన్ గా నటిస్తోంది. ఇక రష్మిక పుష్ప2 అల్లు అర్జున్, నితిన్ సినిమాలతో బిజీగా ఉంది.

Also Read: TSRTC: పాపులారిటీ కోసం ఇలాంటివి చేయొద్దు, సజ్జనార్ వార్నింగ్!