Bigg Boss Telugu 6: సూర్య, ఆరోహి మధ్య లవ్ ట్రాక్.. బిగ్ బాస్ ప్లాన్ మాములుగా లేదుగా!

Bigg Boss Telugu 6: బిగ్ బాస్ ఇంట్లో ఆర్జే సూర్య, ఆరోహి కలిసి వచ్చారా? ముందే ప్రిపేర్ అయి వచ్చారా? అన్నది ఎవ్వరికీ తెలియదు. బిగ్ బాస్ టీం కావాలనే ఇలా సెలెక్ట్ చేసి ఉంటారా? ఇద్దరూ ఒకే చోట పని చేస్తున్నారు.. వారిద్దరి మధ్య ఏదో ఒక రిలేషన్ ఏర్పడి ఉంటుంది..

  • Written By:
  • Updated On - September 18, 2022 / 11:28 PM IST

Bigg Boss Telugu 6: బిగ్ బాస్ ఇంట్లో ఆర్జే సూర్య, ఆరోహి కలిసి వచ్చారా? ముందే ప్రిపేర్ అయి వచ్చారా? అన్నది ఎవ్వరికీ తెలియదు. బిగ్ బాస్ టీం కావాలనే ఇలా సెలెక్ట్ చేసి ఉంటారా? ఇద్దరూ ఒకే చోట పని చేస్తున్నారు.. వారిద్దరి మధ్య ఏదో ఒక రిలేషన్ ఏర్పడి ఉంటుంది.. అలాంటి వాళ్లను ఇంట్లోకి తీసుకొస్తే కంటెంట్ ఏమైనా క్రియేట్ అవుతుందని బిగ్ బాస్ టీం భావించిందా? అన్నది తెలియడం లేదు. కానీ తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో మాత్రం చర్చకు దారి తీసింది.

ఆరోహి, సూర్య ఇద్దరూ కూడా ఇస్మార్ట్ న్యూస్ ప్రోగ్రాంలో కనిపిస్తుంటారు. ఇస్మార్ట్ అంజలిగా ఆరోహి, కొండబాబుగా సూర్య అందరినీ ఎంటర్టైన్ చేస్తుంటారు. ఈ ఇద్దరూ టీవీ9లో పని చేస్తుంటారు. అయితే ఈ ఇద్దరినీ బిగ్ బాస్ ఇంట్లోకి ఒకే సారి ఎలా తీసుకున్నారు? అనేది తెలియడం లేదు. అయితే ఈ ఇంట్లో ఇప్పటికే సూర్య, ఆరోహిల మీద కొన్ని రూమర్లు పుట్టుకొచ్చేశాయి. ఈ ఇద్దరూ కూడా కాస్త క్లోజ్‌గానే ఉంటున్నారు.

శనివారం నాటి ఎపిసోడ్‌లో ఆర్జే సూర్యను నాగ్ మందలించాడు. మరీ మంచితనం ఎక్కువైందంటూ సెటైర్లు వేశాడు. దీంతో సూర్య కాస్త డల్ అయ్యాడు. పక్కన వారి కోసం ముందు మన గురించి మనం ఆలోచించాలని అర్థమైందంటూ సూర్య తన ఫ్రెండ్ ఆరోహితో చెప్పుకొచ్చాడు. ఈ చర్చ అంతా కూడా బాత్రూం ఏరియాలో పెట్టేసుకున్నారు. అనంతరం ఆరోహిని గట్టిగా హత్తుకున్నాడు సూర్య.

ఇక ఇప్పుడు రిలీజ్ చేసిన ప్రోమోలో సూర్య, ఆరోహి మధ్య ట్రాక్ పెట్టేందుకు నాగ్ ప్రయత్నించాడు. మూడేళ్లుగా ఒకే చోట ఉన్నాం.. అప్పుడు పుట్టంది ఇప్పుడు పుడుతుందా? అని నోరు జారింది ఆరోహి. మీ రిలేషన్ గురించి మేం అడిగామా? అంటూ డబుల్ మీనింగ్‌లో నాగ్ అడిగేశాడు. మొత్తానికి ఆరోహి సూర్యల మధ్య ట్రాక్ వర్కవుట్ అవుతుందా? లేదా? అన్నది చూడాలి.