Arjun Kapoor: పెళ్లికి ముందు సన్నిహితంగా ఉండటం మంచిదేనా..? రిపోర్టర్ ప్రశ్నతో షాక్ తిన్న అర్జున్ కపూర్..!!

  • Written By:
  • Updated On - November 18, 2022 / 11:38 AM IST

బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్..ఎంటీవీ వెబ్ సిరీస్ నిషేద్ 2 ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ మధ్యే అర్జున్ కపూర్ ఓ కార్యక్రమంలో భాగంగా మీడియాతో ముచ్చటించాడు. అబార్షన్, క్షయ, లైంగింకంగా సక్రమించే వ్యాధులతోపాటు అనేక ఇతర విషయాలపై ఈ కార్యక్రమంలో చర్చించారు. ఇంతలో ఓ రిపోర్టర్ …పెళ్లికి ముందు సెక్స్,మల్టిపుల్ రిలేషన్స్ కలిగి ఉండటం ఎంతవరకు సరైందని ప్రశ్నించాడు.

మన దేశ సంస్కృతి ఏంటంటే పెళ్లికి ముందు ఎవరూ సెక్స్ లో పాల్గొనరు. పెళ్లి తర్వాత కలిసి ఉంటారు.దీనిగురించి మీరు ఏం చెబుతారు? భారత స్త్రీ ఒకే పురుషుడితో కలిసి ఉంటుంది. ఒకసారి మాత్రమే వివాహం చేసుకుంటుంది. దీని గురించి మీరు ఏం అనుకుంటున్నారు? పెళ్లికి ముందు సెక్స్ సరైందేనా? అని రిపోర్టర్ ప్రశ్నల వర్షం కురింపించాడు.

దీంతో రిపోర్టర్ అడిగిన ప్రశ్నలకు అర్జున్ కపూర్ ఒక్కసారిగా కంగుతిన్నాడు. వివాహానికి ముందు సెక్స్ గురించి తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ…ఈ గుర్తింపును ఎవరు ఇచ్చారు? రిపోర్టర్ గారు చెప్పండంటూ చిరునవ్వుతో సమాధానం దాటవేశాడు. ఒక వ్యక్తి జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఉంటాయి. మీరుచాలా మందిని కలుస్తారు. అనేక సంబంధాలను కలిగి ఉంటారు. మీరు ఎవరిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నావో అది వారిద్దరి మధ్యే ఉంటుంది. పెళ్లికి ముందు రిలేషన్ లో ఉండటం పెద్ద విషయం కాదు అన్నారు. రిపోర్టర్ మాట్లాడుతున్నా అతని మాటలు వినేందుకు అర్జున్ నిరాకరించారు.

ఇదిలా ఉండగా మలైకాతో అర్జున్ కపూర్ డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరు త్వరలోనే వివాహం చేసుకోనున్నట్లు ప్రకటించారు. అర్జున్ కపూర్ ప్రస్తుతం కుట్టే మూవీలో నటిస్తున్నారు. ఆస్మాన్ భరద్వాజ్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇవేకాకుండా ది లేడీ కిల్లర్, మేరీ పట్నీ రీమేక్ మూవీలో కూడా నటిస్తున్నాడు అర్జున్ కపూర్.